టీ20 వరల్డ్‌కప్-2024లో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. గయానా వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
అయితే ఈ సెమీస్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ స్ధానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10:00 గంటలకు( భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు) ప్రారంభం కానుంది. ప్రస్తుతం గయానాలో భారీ వర్షం కురుస్తోంది.
బుధవారం రాత్రి కూడా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మ్యాచ్‌కు వర్షం కచ్చితంగా అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
కాగా తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. కానీ భారత్, ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది.
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే సూపర్–8 దశలో టాపర్‌గా నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతోంది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment