Rain threat
-
భారత్-ఇంగ్లండ్ సెమీస్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
టీ20 వరల్డ్‌కప్-2024లో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. గయానా వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ సెమీస్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ స్ధానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10:00 గంటలకు( భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు) ప్రారంభం కానుంది. ప్రస్తుతం గయానాలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి కూడా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మ్యాచ్‌కు వర్షం కచ్చితంగా అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. కాగా తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. కానీ భారత్, ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే సూపర్–8 దశలో టాపర్‌గా నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతోంది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. -
బంగ్లాతో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తుంటే.. బంగ్లాదేశ్ సైతం భారత్‌ను ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. శనివారం మ్యాచ్ జరిగే అంటిగ్వాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్.కామ్ ప్రకారం.. వర్షం పడటానికి 40 శాతం చాన్స్ ఉంది.శనివారం ఉదయం నుంచే తేలికిపాటి జల్లులు కురిసే అవకాశముంది అక్యూ వెదర్ తెలిపింది. కాగా కరేబియన్ దీవుల కాలమానం ప్రకారం భారత్-బంగ్లా మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరోపాయింట్ లభిస్తోంది.చదవండి: IND vs AFG: ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్! -
India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...
పోర్ట్ట్ ఎలిజబెత్: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది. జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు. టాస్ పడితే... డర్బన్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్కె, బర్గర్లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్రమ్ తన మార్క్ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్ రోజు వానపడినా... మ్యాచ్ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. -
T20 World Cup 2022: ఆఖరి పోరాటం
26 అక్టోబర్, 2022: ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్ 27 అక్టోబర్, 2022: జింబాబ్వే చేతిలో స్వయంకృతంతో ఓడిన పాక్ టి20 ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్‌ల తర్వాత ఈ రెండు జట్లపై సహజంగానే విమర్శలు చుట్టుముట్టాయి... టోర్నీలో ముందుకెళ్లడంపై సందేహాలు కనిపించాయి. కానీ అటు పాక్, ఇటు ఇంగ్లండ్ మళ్లీ ఉవ్వెత్తున ఎగిసాయి. తమలోని అసలు సత్తాను చూపిస్తూ దూసుకొచ్చాయి. ఇప్పుడు నవంబర్ 13, 2022న ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అన్ని అంచనాలను దాటి, ఫేవరెట్లను వెనక్కి నెట్టి విశ్వ విజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. ఈ మెగా టోర్నీని ఇప్పటికే చెరోసారి గెలుచుకున్న టీమ్‌లలో ఎవరి ఖాతాలో రెండోసారి ట్రోఫీ వెళుతుందో చూడాలి. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికపై ఐసీసీ టోర్నీలో ఫైనల్లో ఈ రెండు జట్లు ముఖాముఖిగా ఎదుర్కోవడం ఇది రెండోసారి. 1992 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్ గెలవగా... మూడు దశాబ్దాల తర్వాత అదే పునరావృతమవుతుందా లేక భిన్నమైన ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరం. మెల్బోర్న్: అనూహ్య ఫలితాలు, హోరాహోరీ మ్యాచ్‌లు, çసంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టి20 ప్రపంచకప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 42 గ్రూప్ మ్యాచ్‌లు, 2 నాకౌట్ మ్యాచ్‌ల తర్వాత 45వ పోరులో విశ్వ విజేత ఎవరో తేలనుంది. నేడు జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్లు పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ప్రస్తుత బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లలోనూ రెండు జట్లూ ఏకపక్ష విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్ గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య దాదాపు ఇదే ఆటగాళ్లతో 7 టి20 మ్యాచ్‌ల సిరీస్ జరిగింది కాబట్టి ప్రత్యర్థి గురించి ఆయా జట్టుకు మంచి అవగాహన ఉంది. మార్పుల్లేకుండా... సెమీస్‌లో అన్ని విధాలా సత్తా చాటిన పాకిస్తాన్ ఫైనల్ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మిడిలార్డర్లో మసూద్, ఇఫ్తికార్, నవాజ్‌లతో జట్టు బ్యాటింగ్ మెరుగ్గానే ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి పోటీ పడుతున్న లెగ్‌స్పిన్నర్ షాదాబ్ ఆల్‌రౌండర్ పాత్రలో జట్టుకు టోర్నీ ఆసాంతం అండగా నిలిచాడు. అన్ని మ్యాచ్‌లలాగే పాక్ నలుగురు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగడం ఖాయం. షాహిన్ అఫ్రిది గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రమాదకరంగా మారడం సానుకూలాంశం. నసీమ్, వసీమ్ కూడా తమ పరిధిలో రాణిస్తుండగా రవూఫ్‌పై కూడా పాక్ ఆశలు పెట్టుకుంది. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడిన అతడిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదు. ఓపెనర్లే కీలకం... సెమీస్‌లో హేల్స్, కెప్టెన్ బట్లర్ ఆటను చూస్తే వారిద్దరు ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో తెలుస్తుంది. అయితే వీరిద్దరు మినహా ఇంగ్లండ్ మిడిలార్డర్లో ఎవరు కూడా టోర్నీ మొత్తంలో ఒక సిక్స్‌కు మించి కొట్టలేదు! స్టోక్స్, బ్రూక్స్, లివింగ్‌స్టోన్ కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఈ బలహీనతపై తమ స్పిన్‌తో పాక్ దెబ్బ కొట్టగలిగితే ఇంగ్లండ్‌కు కష్టం కావచ్చు. అయితే ఓపెనర్లే ఆటను ఏకపక్షంగా మార్చేయగలరు కాబట్టి వారిద్దరే కీలకం కానున్నారు. ఆరంభంలో షాహిన్‌ని సమర్థంగా ఎదుర్కోగలిగితే హేల్స్, బట్లర్ ఆపై ఆధిపత్యం ప్రదర్శించగలరు. జట్టులో దాదాపు అందరూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవారే అయినా అదే దూకుడుతో వికెట్లు కూడా చేజార్చుకోగలరు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్లు మొయిన్ అలీ, వోక్స్, స్యామ్ కరన్‌లపై అదనపు బాధ్యత ఉంది. అయితే టోర్నీలోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న మార్క్ వుడ్ టీమ్‌లో లేకపోవడం జట్టుకు కొంత సమస్యగా మారింది. సెమీస్ లో కూడా అతను ఆడలేదు. ఫైనల్‌కు అతను వస్తే జట్టు బౌలింగ్ బలం పెరుగుతుంది. టోర్నీలో చక్కటి ప్రభావం చూపించిన కరన్ కూడా రాణిస్తే పాక్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మొత్తంగా చూస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బలంగా ఉండగా, బౌలింగ్‌లో పాకిస్తాన్‌ది పైచేయిగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ గెలిస్తే ఒకే సమయంలో వన్డే, టి20 వరల్డ్‌కప్‌లను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. పిచ్, వాతావరణం ఫైనల్‌కు పెద్ద సమస్య వర్షం రూపంలోనే పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదివారం 100 శాతం వర్ష సూచన ఉంది. అయితే మెల్బోర్న్ వాతావరణం అనిశ్చితికి మారుపేరు. భారత్, పాక్ మ్యాచ్‌కు ముందు కూడా ఇలాగే భావించినా, ఒక్క చుక్క వర్షం పడలేదు! ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. అయితే నిబంధనల ప్రకారం రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్ల ఆట జరిగితే ఆదివారమే ఫలితం తేలిపోతుంది. అంతకన్నా తక్కువకే ఆట ఆగిపోతే, సోమవారం అదే స్కోరు నుంచి కొనసాగిస్తారు. పిచ్ ఆరంభంలో పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాటర్లు దానిని అధిగమిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. 9: పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 28 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 9 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ నెగ్గగా... 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. మరో మ్యాచ్ రద్దయింది. 29: టి20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ ఇంగ్లండే విజయం సాధించింది. 3: ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లకిది మూడో టి20 ప్రపంచకప్ ఫైనల్. 2007లో పాక్ రన్నరప్‌గా నిలిచి, 2009లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ 2010లో చాంపియన్‌గా నిలిచి, 2016లో రన్నరప్‌తో సంతృప్తి పడింది. 59: ఇప్పటి వరకు ఏడు టి20 ప్రపంచకప్ ఫైనల్స్ జరగ్గా... ఛేజింగ్ చేసిన జట్లు ఐదుసార్లు... తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు రెండుసార్లు గెలిచాయి. -
ఐపీఎల్ ఫైనల్‌కు వానగండం
బెంగళూరు: దాదాపు రెండు నెలలుగా ఆసక్తిగా సాగుతున్న ఐపీఎల్ సమరం ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ పోరులో విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదా? లేక సన్ రైజర్స్ హైదరాబాద్దా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు రాత్రి జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్సుకతతో ఉన్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్ పోరుకు వర్షం రూపంలో గండం పొంచిఉంది. బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా బెంగళూరు, హైదరాబాద్ జట్ల ప్రాక్టీస్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. బెంగళూరులో ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటి? వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ నిర్వహించడానికి సాధ్యంకాకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం సోమవారం రిజర్వ్ డే ఉంది. ఈ రోజు వర్షం కారణంగా ఆలస్యమైతే.. మ్యాచ్ నిర్వహించడానికి అర్ధరాత్రి 12:26 గంటల వరకు సమయం ఉంది. ఐదు ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ రోజు మ్యాచ్ మొదలయిన తర్వాత వర్షం కారణంగా ఆగిపోతే.. మిగిలిన ఆటను మరుసటి రోజు అనగా సోమవారం కొనసాగిస్తారు. ఈ రోజు టాస్ వేసిన తర్వాత మ్యాచ్ ఆరంభంకాకుంటే.. రేపు 20 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు. ఇరు జట్లు కొత్తగా ఫైనల్ లెవెన్ జట్లను ఎంపిక చేసుకోవచ్చు. రేపు కూడా 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యంకాకపోతే.. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యంకాని పక్షంలో లీగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టును విజేతగా ఎంపిక చేస్తారు. కాగా లీగ్ దశలో హైదరాబాద్, బెంగళూరు జట్లు తలా ఎనిమిది విజయాలతో 16 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అత్యధిక రన్‌రేట్ ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. హైదరాబాద్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న బెంగళూరు ఐపీఎల్ చాంపియన్ అవుతుంది.