టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తుంటే.. బంగ్లాదేశ్ సైతం భారత్‌ను ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. శనివారం మ్యాచ్ జరిగే అంటిగ్వాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్యూ వెదర్.కామ్ ప్రకారం.. వర్షం పడటానికి 40 శాతం చాన్స్ ఉంది.
శనివారం ఉదయం నుంచే తేలికిపాటి జల్లులు కురిసే అవకాశముంది అక్యూ వెదర్ తెలిపింది. కాగా కరేబియన్ దీవుల కాలమానం ప్రకారం భారత్-బంగ్లా మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరోపాయింట్ లభిస్తోంది.
చదవండి: IND vs AFG: ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
Comments
Please login to add a commentAdd a comment