Second world war bomb
-
పిల్లలాడుకునే బొమ్మనుకుని ‘చావు’తో ఆడుకున్నారు..
వాషింగ్టన్: భార్యాభర్తలు పిల్లలతో కలిసి సరదాగా పిక్నిక్కు వెళ్లారు. అక్కడ నదిలో వారికి ఓ వింత వస్తువు కనిపించింది. చూడ్డానికి పిల్లలాడుకునే బొమ్మలా ఉన్న దాంతో కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఆ వస్తువును వారు నదిలో ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టారు. ఆ తర్వాత వస్తువు గురించి నిజం తెలిసి ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది. ఎందుకంటే వారు పార్క్లో ఆడుకున్న వస్తువు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పేలని బాంబు. చదువుతుంటేనే గుండె జారి పోతుంది కదా.. ఆ వివరాలు.. అమెరికాకు చెందిన డేవిడ్, కరెన్ హబ్బర్ట్ తమ పిల్లలతో కలిసి నాటింగ్హామ్షైర్లోని నెవార్క్లోని థోర్స్బీ పార్క్కు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో డేవిడ్కు పక్కనే ఉన్న నదిలో ఓ వింత వస్తువు కనిపించింది. దాన్ని తెచ్చి భార్యకు చూపించాడు. ఈ ఇనుప వస్తువును చూస్తే.. ఏదో పేలుడు పదార్థంలాగా అనిపిస్తుంది అన్నాడు. కానీ డేవిడ్ భార్య అతడి మాటలు కొట్టి పారేసింది. దాన్ని కేవలం పిల్లలు ఆడుకునే వస్తువుగా తేల్చింది. దాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాడో.. అక్కడే పెట్టమంది. భార్య మాట ప్రకారం డేవిడ్ దాన్ని నదిలో పెట్టేసి వచ్చాడు. ఆ తర్వాత వారు బాంబుకు పది మీటర్ల దూరంలో పిల్లలతో కలిసి చేపలు పట్టారు.. ఆడుకున్నారు.. తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కరెన్ థోర్స్బీ పార్క్ ఫేస్బుక్ పేజ్లో తాము కనుగొన్న వస్తువు గురించి చూసి ఆశ్చర్యపోయింది. ఆ పోస్ట్ మొత్తం చదివి భయంతో కుప్పకూలింది. పార్క్ వారు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్ కనుగొన్న ఆ మెటల్ వస్తువు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబని.. దాని నుంచి దూరంగా ఉండాలని.. పట్టుకోవద్దని సూచించింది. పార్క్లో ఎక్కడైనా ఇలాంటి మెటల్ వస్తువులు కనిపిస్తే.. వెంటనే తమ పార్క్ సిబ్బందికి తెలపాలని.. వారు దాన్ని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా కరెన్ మాట్లాడుతూ.. ‘‘నిజం తెలిసిన తర్వాత దీని గురించి నా భర్తకు తెలపాలంటే భయపడ్డాను. నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు. నేను షాకయ్యాను’’ అన్నది. ఇక గతంలో ఈ పార్క్ రెండో ప్రపంచ యుద్ధ స్థావరంగా ఉండేదని తర్వాత తెలిసింది. చదవండి: రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు -
లండన్ ఎయిర్పోర్టు మూసివేత!
లండన్ : బాంబు వార్తతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆదివారం సిటీ ఎయిర్పోర్టు వద్ద బాంబు జాడ లభ్యం కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. థేమ్స్ నది ఒడ్డున కింగ్ జార్జి వీ డాక్ వద్ద నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో ఈ బాంబు బయటపడింది. రన్ వేకు ఈ ప్రాంతంలో సమీపంలో ఇది ఉండటంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు పంపించి వేసిన అధికారులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిర్పోర్టు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శక్తివంతమైన ఈ బాంబు బహుశా రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెప్టెంబర్ 1940, 1941 మే నెలల మధ్య లండన్ నగరంపై దాడి చేసిన జర్మన్ ఎయిర్ఫోర్స్ దళాలు వేల సంఖ్యలో బాంబులను నగరంపైకి జారవిడిచాయి. ఇది కూడా చదవండి... 4000 మందిని కాపాడారు -
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం
బెర్లిన్: జర్మనీ దేశ రాజధాని బెర్లిన్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును పోలీసులు గుర్తించినట్టు అక్కడి స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. 250 కేజీ బరువు గల అమెరికన్ బాంబును నిర్వీర్యం చేసే ఆపరేషన్ లో భాగంగా 11 వేల మంది ప్రజలను అక్కడి నుంచి తరలించినట్టు పేర్కొంది. జీవీస్ మ్యూజియం సమీపంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తయారుచేసిన అమెరికన్ బాంబును గుర్తించి... ఆదివారం రెండు డిటోనేటర్లను అధికారులు నిర్వీర్యం చేసినట్టు ఈఎఫ్ఈ న్యూస్ నివేదించింది. ఈ ఆపరేషన్ సమయంలో కొన్ని మెట్రో, బస్సు లైన్లను కూడా తాత్కలికంగా నిలిపివేశారు. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల వద్ద 4 మీటర్ల లోతు వరకు పాతిపెట్టిన మరో బాంబును అధికారులు గుర్తించారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు.. పరిసర ప్రాంతాల్లో నివసించే 5 వేల మందిని ఖాళీ చేయించారు. ఇలాంటి ఆపరేషన్లు జర్మనీలో జరగడం అసాధారణం కాదు. 2011 లో కోబెన్జ్ లో బాంబును కనుగోనేందుకు అతిపెద్ద ఆపరేషన్ లో భాగంగా 45 వేల మంది ప్రజలను బలవంతంగా వారి ఇళ్లను నుంచి తరలించారు.