secrateriat
-
పురావస్తు శాఖను కోరడానికి అడ్డంకి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని పురాతన ఆలయం, మసీదు కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్ నేతల దరఖాస్తులపై ఏం చేశారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలిపోయాయని ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేతల న్యాయవాది కోర్టు తెలిపారు. పొరపాటున జరిగిందా? ఉద్దేశపూర్వకంగా కూల్చారా? అనే దానిపై పరిశీలిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏజీ హోం క్వారంటైన్లో ఉన్నందున రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. కూల్చీవేతలపై విచారణ జరపాలని పురావస్తు శాఖను కోరడానికి అడ్డంకి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
వారి విమర్శలు అర్థం లేనివి: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతలో భాగంగా ప్రార్థనాలయాలకు జరిగిన నష్టంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. నల్లపోచమ్మ ఆలయం, మసీదులను కొత్తగా నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తరువాత కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘వారికి వెంకయ్యే మధ్యవర్తి’
సాక్షి, నిజామాబాద్ : వెంకయ్య నాయుడు మధ్యవర్తిగా ఉండి బీజేపీలో చేరేలా ప్రొత్సాహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమయ్యి మూడు వారాలు గడుస్తున్నా వానలు లేక రైతాంగం బాధపడుతుందన్నారు. కానీ కేసీఆర్ రైతుల బాధలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల్లో రూ. 60 కోట్ల అప్పు ఉంటే.. టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో అది 1.80 లక్షల కోట్లకు చేరిందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు కేసీఆర్ పాలన సాగుతుందని షబ్బీర్ అలీ విమర్శించారు. సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు, మసీదులు తొలగిస్తే సహించేది లేదన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడం మోదీ, కేసీఆర్‌ల తరం కాదన్నారు షబ్బీర్ అలీ. ఆ భవనాలు మరో 100 ఏళ్ల పని చేస్తాయి : జీవవన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ అసెంబ్లీలు భవనాలు ఇంకా 100 సంవత్సరాల వరకూ పని చేస్తాయని తెలిపారు. -
'కేసీఆర్ పర్మిషన్‌తోనే హైదరాబాద్‌కు బాబు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితోనే హైదరాబాద్‌లో తిరిగి అడుగుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేసీఆర్‌కు చంద్రబాబుకు మధ్యవర్తిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరించారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ ఇచ్చిన కండీషన్ బెయిల్ మీద చంద్రబాబు ఏపీని పరిపాలిస్తున్నారని అన్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేసే చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కులేదని అంబటి ధ్వజమెత్తారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. 'వాట్ ఐయామ్ సేయింగ్ అంటూ' ఫోన్ సంభాషణల్లో అడ్డంగా దొరికిపోయినా, ఇప్పటి వరకు ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని అంబటి చెప్పారు. బినామీ పేర్లతో టీవీ చానళ్లను నడిపించే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో తనకు మద్దతుగా వార్తలు ప్రసారం చేయడంలేదని 13 జిల్లాల్లో ఓ టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేశారన్నారు. అంగన్ వాడీ వర్కర్స్ కోసం గతంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలు..ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అంగన్ వాడి వర్కర్స్‌ను ఉద్దేశించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. -
'కేసీఆర్ పర్మిషన్‌తోనే హైదరాబాద్‌కు బాబు'
-
'రాష్ట్రాన్నిఅమ్మకానికి పెడతారా'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టేలా ఉందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయనిక్కడ మాట్లాడుతూ... వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని తరలించాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సచివాలయం తరలింపు వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతుందని జీవన్ రెడ్డి చెప్పారు. సీఎం వ్యక్తిగత నమ్మకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై భారం పడేలా ఉండరాదని సూచించారు.