ఆప్షన్ల విధానం ఉండాలి... వద్దు
హైదరాబాద్: విభజనలో ఉద్యోగులకు ఆప్షన్ల విధానం ఉండాలని కమల్నాథన్ కమిటీని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కోరింది. రాజకీయ ప్రమేయం, ఒత్తిళ్లు ఉండకూడదన్నారు. స్థానికతతో సంబంధంలేకుండా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. విభజన తేదీకి ముందే పీఆర్సీని ప్రకటించాలన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలను కేంద్రమే కాపాడాలన్నారు.
ఉద్యోగుల విభజనకు ఆప్షన్ల విధానం వద్దని కమల్నాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలంగాణ వాళ్లు, సీమాంధ్రలో సీమాంధ్ర ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని అన్నారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలన్నారు. స్థానికతక ప్రాతిపదిక ఏంటనేది కమలనాథన్ కమిటీ తేల్చాలని సూచించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారి సంగతి తేల్చాలన్నారు.