తెలంగాణ సర్కార్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. కృష్ణాజలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), (బి) ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు, నీటి లభ్యత రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ధర్మాసనం కొట్టివేస్తూ మిగతా పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.