చదువు ఉద్యోగాల కోసమే కాదు: మంత్రి ఈటల
హైదరాబాద్: విద్యార్థులు తాము చదివేది ఉద్యోగాల కోసమే అనే కోణంలో ఆలోచిస్తున్నారని, శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సమాజాభివృద్దికి దోహదపడాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బుధవారం సికింద్రాబాద్ పీజీ కళాశాల వార్షిక వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. ఓయూ వైస్ ఛాన్స్లర్ ఎస్.రామచంద్రంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ఈ వేడుకలను ప్రారంభించారు. సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని మంత్రి అన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించేందుకు శ్రమించాలని విద్యార్థులకు మంత్రి ఈటల పిలుపునిచ్చారు.