50వేల మొక్కలు నాటాలి
l డీఎస్ఓ సంధ్యారాణి
కురవి : పౌర సరఫరాల శాఖ, రేషన్‌డీలర్లు 50 వేల మొక్కలను నాటే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా సివిల్ సప్లై అధికారిణి (డీఎస్ఓ) సంధ్యారాణి అన్నారు. గు రువారం మండల కేంద్రం లోని వీరభద్రస్వామి క ల్యాణమండపం వద్ద ఆమె మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని తెలిపారు. అడవులు నరికివేయడంతోనే కరవు కాటకాలు వస్తున్నాయని, అందుకోసం మొక్కలు నాటి అడవులను పెంచాలన్నారు. రేషన్‌డీలర్లు మొక్క లు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, సంఘం డివిజన్ అధ్యక్షుడు పెనుగొండ వీరభద్రప్రసాదరావు, డిప్యూటీ తహసీల్దార్ శేషగిరిస్వామి, ఆర్ఐ ఫిరోజ్, డీలర్లు మలిశెట్టి సత్యనారాయణ, బీవీ ప్రసాద్, శ్రీనివాస్, ఆలయ సిబ్బంది బాదె వెంకన్న, సమ్మయ్య పాల్గొన్నారు.