seeds formers
-
ఖరీఫ్ సాగు లక్ష్యం ..93.91 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను వైఎస్సార్ ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా సాగు నీటిని విడుదల చేయడం ద్వారా జూన్ మొదటి వారంలోనే నాట్లు పడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్–2022లో 93.91 లక్షల ఎకరాల్లో పంటల్ని సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానంగా 40.34 లక్షల ఎకరాల్లో వరి, 18.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతాయని అంచనా. ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ రానున్న సీజన్లో రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారి వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల (నాన్ సబ్సిడీ)ను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయబోతున్నారు. వేరుశనగ విత్తన పంపిణీ మే మూడో వారం నుంచి, వరి విత్తనాలను జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు. గిరిజన మండలాల్లో మాత్రం వేరుశనగ, వరి విత్తనాలను మే 3వ వారం నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు 19.02 లక్షల టన్నుల ఎరువులు కేటాయించారు. వీటిని ల్యాబ్‌లలో సర్టిఫై చేసిన తర్వాతే పంపిణీ చేయబోతున్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. ఈసారి మొత్తం వినియోగంలో కనీసం 30 శాతం ఎరువులు, 10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో రూ.92,687 కోట్ల మేర వ్యవసాయ రుణాలివ్వాలని నిర్దేశించారు. రైతు ముంగిటకే అన్నిసేవలు ఖరీఫ్‌లో ప్రతి రైతుకు వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పకడ్బందీ ఏర్పాట్లు పంటలు వైపరీత్యాల బారిన పడకుండా సాధ్యమైనంత త్వరగా సీజన్ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. 8,508 పొలం బడులు నిర్వహించడం ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుడుతున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ (చదవండి: రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!) -
సాగు సాగేదెలా..?
మెదక్‌జోన్: కాలం కలిసిరాక సాధారణం కన్నా వర్షపాతం తక్కువ నమోదైతే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరుస కరువు కాటకాలతో అప్పుల పాలవుతున్న రైతులు వర్షాలకోసం ఎదురుచూస్తూ దీర్ఘకాలిక పంటలైన వరి పంటలకు బదులు తేలికపాటి పంటలైన ఆరుతడి పంటలను సాగుచేస్తే అడపాదడప వర్షాలు కురిసినా, పంటలు పండుతాయనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే అంచనాలను వేశారు. మరో వారం రోజులపాటు వర్షం కురవకుంటే అధికారులు తయారు చేసిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందేనని ఓ జిల్లాస్థాయి అధికారి తెలిపారు. గతేడాది ఇప్పటికే జూన్ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. వర్షాకాల ప్రారంభంలోనే గత సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఈ యేడు నేటికి చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. దీంతో కనీసం దుక్కులు సైతం ఎక్కడ కూడా దున్నలేక పోయారు. ఇప్పటికే 20 రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగు అంచనా 80 వేలహెక్టార్లు.. ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిస్తే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లమేర సాధారణ పంటలు సాగవుతోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసి అందుకు అనుగుణంగా ఎరువులు, సబ్సిడీ విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచారు. అందులో 36 వేల హెక్టార్లలో వరి పంటలు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటలు, 15 వేల హెక్టార్లలో పత్తితో పాటు 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేయటం జరుగుతుందని అంచనాలు వేశారు. నేటికి వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు.. జులై 31వ తేదీ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే మొక్కజొన్న పంటకు బదులు 4200 హెక్టార్లలో కంది(పీఆర్జీ 176) తేలికపాటి రకం పంటను సాగేచేసే విధంగా అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి విత్తనాలు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అలాగే వరిపంటకు బదులు 14,985 హెక్టార్లలో సోయాబీన్ పంటను సాగుచేసేందుకు అందుకు సంబంధించిన సోయాబిన్ విత్తనాలు సిద్ధంగా ఉంచారు. అలాగే పత్తి పంటకు బదులుగా 6085 హెక్టార్లలో నల్లరేగడి భూముల్లో వేసేందుకు కంది విత్తనాలు సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, సాములు, కొర్రలు, విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదయితే తేలికపాటి పంటలు 39000 హెక్టార్లలో పంటలును సాగుచేయాలని అందుకు సంబంధించిన విత్తనాలు సిద్ధంగా ఉంచారు. ప్రత్యామ్నాయానికి సిద్ధం.. మరో 20 రోజుల్లో సరిపడా వర్షాలు కురవకుంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు కోసం రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తుగానే కార్యచరణ పూర్తిచేశాం. ఇందుకు సంబంధించిన విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచాం. వర్షాలు పుష్కలంగా (సరిపడ) కురిస్తేనే ముందస్తు అంచనాల మేరకు జిల్లాలో 80 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. లేనిచో అడపాదడప వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల మేరకు తేలికపాటి పంటలైన 39,000 వేల హెక్టార్లలోనే పంటలను సాగు చేయాల్సి వస్తోంది. ఈ విషయంపై రైతులు తొందర పాటుతనంతో విత్తనాలు వేయొద్దు – పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
అన్నదాతా తొందరొద్దు...
కాళోజీసెంటర్: రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు.. సమయమేమి మించిపోలేదు.. వర్షాలు పడ్డాకనే వేయడం మంచిదని జేడీఏ ఉషాదయాళ్ రైతులకు సూచించారు. ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల విషయమై రైతుల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఆయా సందేహాలను నివృత్తి చేయడానికి సాక్షి నడుం బిగించింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయాళ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగింది. జిల్లాలో సాగులో ఎదురవుతున్న సీజన్‌కు సంబంధించిన అంశాలు, సబ్సిడీ విత్తనాలు, రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు, రైతు బీమా తదితర సమస్యల గురించి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 26 మంది రైతులు ఫోన్ చేశారు. రైతులు అడిగిన సందేహాలను జేడీఏ ఉషాదయాళ్ నివృత్తి చేశారు. వారికి దశల వారీగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. మీకు గతంలో డబ్బులు వస్తే మాత్రం మీకు ఖాతాలో పడుతాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దశల వారీగా పడుతున్నాయి. కొత్త పట్టా పాస్‌బుక్‌లు ఉన్నవారు మాత్రం సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి బ్యాంకు అకౌంట్ నంబర్ ఇవ్వండి. ప్రధానంగా రైతులు ఫసల్ బీమా చేయాలి. బీమా చేసిన రైతులకు నష్టం జరగకుండా బీమా డబ్బులు వస్తాయి. ప్రశ్న : పంటల బీమా ఇన్సూరెన్స్ రాలేదు. మా దగ్గర బాండ్ లేదు ఏమిచేయాలి..?– బత్తుల రాజు, గీసుకొండ మండలం, కొనాయమాకుల జేడీఏ: పంటల బీమా ఇన్సూరెన్స్ గనుక మీరు చేస్తే ఎల్ఐసీ వాళ్ల దగ్గర బాండ్ ఉంటుంది. దానికి సంబంధించి సమాచారం కొరకు మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే ఐడి నంబర్ చెబుతారు. నంబర్ ఆధారంగా ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు. ప్రశ్న : పీఎం కిసాన్ డబ్బులు రాలేదు..?– సదయ్య, కొత్తగూడ, సంగెం. జేడీఏ: పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల రాలేదు. ఇప్పడు కోడ్ అయిపోయింది. వస్తాయి. ప్రశ్న : పత్తి గింజలు ఇప్పుడు పెట్టొచ్చా ..?– సంజీవ, గొర్రెకుంట, గీసుకొండ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్ : పత్తి గింజలు ఇప్పుడే వేయొద్దు్ద. 60.70 మిల్లీమీటర్ల వర్షం పడితేగాని వేయాలి. అంతవరకు వేయకూడదు. జూన్ 20 నుంచి 25 వరకు అవకాశం ఉంది. సహజంగా రోహిణీ కార్తెలో విత్తనాలు వేస్తారు. కాని వర్షాలు పడలేదు కాబట్టి వేయకూడదు. ప్రశ్న : విత్తన తయారీకి ఏ రకమైన విత్తనాలు వాడితే మంచిది..?– బాబురావు, పరకాల వ్యవసాయ శాస్త్రవేత్త : విత్తనం తయారు చేయడానికి గ్రేడింగ్ విత్తనాలనే వాడాలి. వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ గారిని సంప్రదించాలి (సెల్ నెంబర్ 998962533)వారి పర్యవేక్షణలో విత్తనాల ఉత్పత్తి తయారు చేస్తారు. సొంతంగా తయారు చేయడం మంచిది కాదు. ప్రశ్న : సబ్సిడీ విత్తనాలు గ్రామస్థాయిలో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎరువుల దుకాణాలో తనిఖీలు చేయాలి కదా మేడం..?– శ్రీనివాస్, ఎల్గూర్‌రంగంపేట, సంగెం జేడీఏ: నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆలోచిస్తాం. ప్రశ్న : పసుపు విత్తనం ఏ విధంగా పెట్టాలి..? – రవీందర్, కొండాయి, నల్లబెల్లి ఉద్యానశాఖ జేడీఏ శ్రీనివాస్‌రావు : వర్షాలు పెద్దవి పడాలి.. దుక్కి చదును చేసుకొని సిద్ధంగా ఉంచుకొని పెద్ద వర్షం పడ్డాక బోదెలు తయారు చేసి విత్తాలి. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి లాభం ఉంటుంది. -
ఖరారు కాని ఖరీఫ్ ప్రణాళికలు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్ ప్రణాళికలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయలేదు. జూన్ రెండో వారంలో సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే వేసవి దుక్కులను దున్నుకునే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మే మొదటి వారంలోనే ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించిన ప్ర ణాళికలను రూపొందించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపించాల్సి ఉంటుంది. జిల్లా వ్యవసాయ శాఖ పంపించిన ప్రణాళికల ఆధారంలో జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు కానున్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర సబ్సిడీలను కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించకపోవడం వల్ల ఖరీఫ్‌లో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. జిల్లాలో ముఖ్యంగా పత్తి పంటలను ఆగ్రభాగంలో సాగుచేస్తుంటారు. ప్రణాళికలను తయారు చేయడంలో ఆలస్యం కావడం వల్ల పత్తి విత్తనాలకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌సాధారణ సాగు విస్తీర్ణానికి అదనంగా మరో పదిశాతం ఎక్కువగా అంచనా వేసి రాష్ట్ర వ్యవసాయశాఖ అనుమతి కోసం పంపిస్తారు. కానీ ఫిబ్రవరి మాసం నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కారణంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులతోపాటు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు ఎన్నికల విధులు కేటాయించారు. ఈ కారణంగానే ఖరీఫ్ ప్రణాళికలను తయాను చేయడంలో ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో పత్తి సాగు పెరిగే అవకాశం గత సంవత్సరం ఖరీఫ్‌లో పత్తి 2,38,635 హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 2లక్షల 75 వేల హెక్టార్ల వరకు సాగు అయ్యే అవకాశం ఉంటుందని అనధికారికంగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఖరీఫ్‌లో పత్తికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు ఈ సాగుపైనే మొగ్గు చూసే అవకాశం ఉంటుంది. అదే విధంగా వరి 78 వేల హెక్టార్లలో గత సంవత్సరం సాగైంది. ప్రస్తుతం 90వేల హెక్టార్ల వరకు పెరిగి అవకాశం ఉంటుంది. కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ ఇతర పంటలు గత ఖరీఫ్‌లో 23వేల హెక్టార్లలో సాగు కాగా, ప్రస్తుత ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆలస్యమైతే రైతులకు ఇబ్బందులే.. ఖరీఫ్ ప్రణాళికలను తయారు చేయడం ఆలస్యమైతే రైతులకు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ ముందస్తుగా జూన్ మొదటి వారంలోపే విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం నానా అవస్థలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సబ్సిడీపై జనుము, పిల్లపెసర తదితర పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేది. ఏ సమయంలో వర్షాలు కురిసినా వెంటనే ఈ విత్తనాలను చల్లి పొలాలలో దుక్కులను దున్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రణాళికలను సిద్దం చేయకపోవడంతో సబ్సిడీపై పచ్చిరొట్టె, ఇతర వరి, కంది, పెసర వంటి విత్తనాలు రైతులకు అందుబాటులో లేని పరిస్థితి. నెలాఖరుకు పూర్తి చేస్తాం వరుస ఎన్నికల కారణంగా వ్యవసాయశాఖ సిబ్బంది, అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో ఖరీఫ్ ప్రణాళికను తయారు చేయడంలో ఆలస్యమవుతోంది. ఈ నెలాఖరు వరకు ప్రణాళికను పూర్తి చేసి రాష్ట్ర కమిషనరేట్‌కు పంపిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. –శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
ఖరీఫ్‌కు సిద్ధం
మహబూబ్‌నగర్ రూరల్: ఖరీఫ్ సాగుకు ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొన్నిరోజులుగా అధికారులు తలమునకలై కాస్త ఆలస్యంగానైనా ప్రణాళిక తయారు చేశారు. ఒకవైపు రైతు సమగ్ర సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగిస్తూనే ఖరీఫ్ కోసం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉం చేందుకు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 15,977 క్వింటాళ్ల మేర విత్తనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆశల సాగుకు జూన్‌లోనే నైరుతీ రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు పొలం పనులను మొదలెట్టారు. అలాగే అధికారులు 2019 ఖరీఫ్ సాగుపై ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే ఖరీఫ్ సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా రబీలో సేద్యపరంగా వచ్చిన లాభనష్టాలను పక్కకుపెట్టి రైతన్న మళ్లీ అదృష్ట పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగుకు శ్రీకారం చుట్టడానికి రైతులు సరంజామ సిద్ధం చేసుకున్నారు. సిప్పటికే పొలాలను వేసవి దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లు జిల్లాలోని 15 మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 1.25 లక్షల హెక్టార్లు సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 17,211 హెక్టార్లు, జొన్నలు 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 39,000 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు, కందులు 12,000 హెక్టార్లు, పత్తి 38,000 హెక్టార్లతో పాటు పలు రకాల చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరిసాగు కోసం 10,435 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర, ఆముదం, వేరుశనగ, మినుములు, పత్తి పంటలకు ప్రాధాన్యం ఇస్తూ సాగు కోసం ప్రణాళికలు రూపొందించారు. రైతులకు అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు వీలుగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ప్రధానంగా వరి, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి పంటల వివరాలు, భూమి స్వభావం వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతులు, బోరుబావుల కింద వ్యవసాయ సాగు ఎకరాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. 1,35,322 మెట్రిక్ టన్నుల ఎరువులు ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతాంగానికి 1,35,322 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 61,342 మెట్రిక్ టన్నులు, డీఏపీ 25,206 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7,222 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 38,612 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,940 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. అవసరం మేరకు తెప్పిస్తాం జిల్లాలోని రైతులకు అవసరం మేరకు విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వారం పది రోజుల్లో అన్ని మండల కేంద్రాలకు విత్తనాలను పంపిస్తాం. ఎరువులు కూడా సాగుకు అవసరమయ్యే మేర కు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల విషయమై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేను. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ,అధికారి -
స్వల్ప ఊరట
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సబ్సిడీ సోయా విత్తనాల ధరను స్వల్పంగా తగ్గిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది కంటే క్వింటాలుపై రూ.50 తగ్గించింది. 2018 ఖరీఫ్ సీజనులో క్వింటాలు విత్తనాలకు రైతులు చెల్లించాల్సిన మొత్తం రూ.3,700 ఉండేది. ఈసారి ధర రూ.3,650లకు తగ్గించింది. ప్రభుత్వం ఒక్కో క్వింటాలుపై రూ.2,500 సబ్సిడీని భరిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి ఇటీవల ఆదేశాలందాయి. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు సర్కారు ఏటా సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లోని విత్తన ఏజెన్సీల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్, హాకా వంటి సంస్థల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తోంది. కాగా గతేడాది ఖరీఫ్ సీజనులో ఈ విత్తన ధర క్వింటాలుకు రూ.6,200 చొప్పున నిర్ణయించగా, ఈసారి రూ.6,150 చొప్పున విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. పెరుగుతున్న విత్తన ధరలు.. సోయా విత్తనాల కొనుగోలు ధర ఏటా పెరుగుతూ వస్తోంది. 2017 ఖరీఫ్ సీజనులో క్వింటాలుకు రూ.5,475 చొప్పున కొనుగోలు ధరగా నిర్ణయించింది. 2018 ఖరీఫ్ సీజను నాటికి ఈ ధర క్వింటాలుకు రూ.6,200లకు పెరిగింది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని కూడా గత ఏడాది పెంచింది. క్వింటాలుపై రూ.1,825 నుంచి రూ.2,500లకు పెంచింది. దీంతో రైతులపై భారం పడలేదు. వరి తర్వాత సోయానే అధికం.. జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజనులో వరి తర్వాత సోయానే అ«త్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు కాగా, గతేడాది సుమారు 83 వేల ఎకరాల్లో సోయా పంట సాగైంది. ఈసారి ప్రాజెక్టుల నీటి మట్టం ఆశాజనకంగా కనిపించక పోవడంతో సోయా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ సారి పంట సాగు విస్తీర్ణం 1.12 లక్షల ఎకరాలకు పెరగనున్నట్లు అంచనా వేస్తోంది. సుమారు 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై అందించాలని భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. -
గ్రాసం కోసం పశువుల విలవిల
సాక్షి, ఇల్లందకుంట: వేసవి ముదిరే కొద్దీ కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు పండక గ్రాసానికి అవస్థలు తప్పడం లేదు. మూగజీవాలకు మేతకోసం ఇతర ప్రాంతాలకు ప్రతిరోజు వాహనాలపై కాపరులు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల మేత పెంపకానికి కార్యక్రమాలు చేస్తున్న క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పశు సంవర్ధక శాఖ పంపిణీ చేస్తున్న పశుగ్రాసం, విత్తనాపంపిణీ మొక్కుబడిగా మారింది. ఫలితంగా పశువులను రైతులు సంతలో విక్రయిస్తున్నారు. ఉపాధి, వాటర్‌షెడ్ పథకాల్లో భాగంగా పశుగ్రాసాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత శాఖ సిబ్బంది నుంచి ప్రోత్సాహం కరువైంది. కొంతమంది రైతులే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. ముందస్తు సమాచారం లేక ఉచిత విత్తనాలు ఇతర రైతులకు అందలేదు. ఉపాధిహామీ పథకంలో పశుగ్రాసం పెంపకానికి చేపట్టిన కార్యక్రమం నివేదికలకే పరిమితమైంది. సమాచార లోపంతో రైతులకు ఉచిత విత్తనాలు కరువయ్యాయి. ఇప్పటికే మండలవ్యాప్తంగా పశుసందప తగ్గుముఖం పడుతోంది. ఇటు పశుగ్రాసం కొరత అన్నదాతను కలవరపెడుతోంది. ఎడ్లబండిలోడ్ వరి గ్రాసానికి రూ.వెయ్యికి పైగా, ట్రాక్టర్ వరి గ్రాసాన్ని రూ.6వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో పశు సంపదను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. పశువులను పోషిస్తున్న రైతులు గ్రాసం కోసం అధిక ధరలు వెచ్చించి పశు సంపదను కాపాడుకుంటున్నారు. మొక్కుబడిగా విత్తనాల పంపిణీ ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంపిణీ చేసే గ్రాసం విత్త నాలు మొక్కుబడిగా అందిస్తున్నారు. అవి కూ డా పలుకుబడి ఉన్నవారికి ఇస్తున్నారు. విత్తనాల సరఫరా చేస్తున్న ట్లు ఎలాంటి సమాచారం ఇవ్వరూ. తీరా విషయం తెలుసుకొని వెళ్లే సరికి విత్తనాలు ఉండడం లేదు. - అంబటి రమేశ్, రైతు తక్కువకు అమ్ముతున్నం వేసవికాలం కరువు పరిస్థితులతో తక్కువ ధరలకు పశువులను విక్రయిస్తున్నాం. వేలకు వేలు డబ్బులు ఖర్చులు పెట్టినా గ్రాసం మార్కెట్లో దొరకడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్నా రాయితీలు అందడం లేదు చివరికీ పశుసంపద అంతరించి పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఏంచేయాలో అర్థం కావడం లేదు. – చెన్నారెడ్డి, రైతు తిప్పలు పడుతున్నాం మూగజీవాలకు పశుగ్రాసం అందించేందుకు నా నా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల కు వేలాది రూపాయల డబ్బులు పెట్టి దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. దీంతోఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నాం. మా సమస్యపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – దార సదయ్య , రైతు -
పత్తి రైతు చిత్తు
గద్వాల/నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. గతేడాది అనావృష్టి.. ఈ ఏడాది అతివృష్టి పత్తి రైతును చిత్తుచేశాయి. ఈ ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో పత్తిపంట సాగుచేస్తే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కీలకమైన క్రాసింగ్దశలో వర్షం కురుస్తుండటంతో విత్తన పత్తిపూత రాలిపోతుం ది. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పత్తిపైరు తెగుళ్లబారినపడి ఎర్రగా మారిం ది. వరదనీటిలోనే మురిగిపోతుంది. ఇ ప్పటికే దోమకాటు తెగులు పత్తిపంట ఆ శించడంతో ఎన్ని మందులు పిచికారి చేసినా వర్షాల కారణంగా ఫలితం లే కుండాపోయింది. పత్తి విత్తనరైతులు ఏ టా ఏప్రిల్‌లో పంటను విత్తుకుని మే చి వరి నుంచి జులై చివరి వరకు క్రాసింగ్ చేసుకునేవారు. అయితే ఈ సారి పత్తి విత్తనాలను రైతులకు ఇచ్చే విషయంలో కంపెనీలు జాప్యం చేయడంతో జూన్ ఆఖరి నుంచి రైతులు తమ పొలాల్లో ప త్తిని సాగు చేసుకున్నారు. 100రోజుల తరువాత మగ, ఆడ పువ్వులకు క్రాసిం గ్ చేసుకునేవారు. ప్రస్తుత కీలక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. పంట కాపు సమయంలో వర్షాలు అధికమవడంతో ఆశించిన కాయలు రాక, తెగుళ్లను నివారించుకోలేక రైతులు అయోమయంలో పడ్డారు. విత్తనపత్తి రైతుకు తీవ్ర నష్టం వాతావరణ పరిస్థితులు అనుకూలించే నడిగడ్డ ప్రాంతంలో రైతులు ఈ ఖరీఫ్ లో సుమారు 30వేల ఎకరాల్లో విత్తనపత్తిని సాగుచేశారు. ఇందుకోసం ప్రతి ఎ కరా సాగుకోసం రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్ర తిరైతు ఎక్కువ విస్తీర్ణంలోనే సాగుచేశా డు. పంటకాపు ప్రారంభమయ్యే దశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతుకు ఇ బ్బందికరంగా మారింది. వర్షాల కారణంగా పొలంలో పంటకు ఉపయోగప డే ఎలాంటి ఎరువులను వేసుకునే పరిస్థి తి లేకుండాపోయింది. తెగుళ్ల ఉధృతి కూ డా మొదలైంది. పంటను కాపాడుకోలే రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. రైతు కష్టం వర్షార్పణం ఈ ఏడాది నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 70వేల ఎకరాల్లో పత్తి సాగయింది. ఇందుకోసం రైతులు సుమారు రూ.105 కోట్లు ఖర్చుచేశారు. ఒక్కోరైతుసాగుకోసం రూ.20 నుంచి రూ.28వేల వరకు ఖర్చుచేశారు. తొలుత సకాలంలో వర్షాలు కురవడంతో పైర్లు కూడా ఆశాజనకంగా ఎదిగాయి. అయితే నెలరోజులుగా భారీ ముసురు వర్షాలు పత్తి పంటను తీవ్రంగా నష్టపరిచాయి. ఎదిగిన పైరుకు తొలుత గూడ(పత్తికాయ) చక్కగా కాసింది. దీంతో ఈసారి దిగుబడి భారీగా వస్తుందని రైతులు భావించారు. వర్షాలు కూడా అనుకూలించడంతో పెట్టుబడులకు ఏమాత్రం వెనకంజ వేయలేదు. వర్షాలు ఎడతెరిపి ఇచ్చి కాస్త ఎండ రాగానే ఎరువులు, పురుగు మందులు చల్లుతూ వచ్చారు. కాగా కొంతకాలంగా వరుసగా వస్తున్న వర్షాలు పత్తిపంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నల్లరేగడి నేలలో పొలాల్లో నీరు నిలిచి ఎదుగుదల ఆగిపోయింది. ఆకులు ఎర్రగా మారాయి. గూడ కొంత రాలిపోగా మరికొంత పక్వం కాకముందే కాయ పగిలి వర్షాలకు తడిసి పత్తి నల్లగా మారుతోంది. కొత్తగా కాయలు కాయకపోవడం, ఉన్న వాటి పరిస్థితి ఇలా కావడంతో దిగుబడి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. రూ.140కోట్లకు పైగా పంటనష్టం సాధారణంగా ఎర్ర, ఇసుక నేలల్లో ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒండ్రుమట్టి నేలల్లో 8నుంచి12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఆ లెక్కన సరాసరి ఈ ఏడాది ఐదు లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి రావాల్సి ఉంది. దీనికి ధరను పరిశీలిస్తే రూ.250కోట్ల ఆదాయం రైతులకు రావాల్సి ఉంది. అయితే అతివృష్టి ఫలితంగా పరిస్థితి తారుమారైంది.