రాష్ట్రపతి ముందు రాయల-తెలంగాణ ప్రతిపాదన
ఢిల్లీ: రాయలసీమ నేతలు ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన రాయల-తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను ఆయన ముందుంచారు. రాష్ట్రపతికి కలిసినవారిలో రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్ ఉన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు జరిగే నష్టం గురించి తెలిపారు. అలాగే రాయలతెలంగాణ ప్రతిపాదన గురించి కూడా వివరించారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పటి నుంచి రాయల-తెలంగాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొందరు రాయల-తెలంగాణ అంటే, మరికొందరు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఈరోజు సీమ నేతలు రాష్ట్రపతికి కలిసి తమ సమస్యలు వివరించారు.