సీమాంధ్రలో టీడీపీ ముందంజ
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి
653 జెడ్పీటీసీల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 275, టీడీపీకి 373 స్థానాలు
10,092 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 4,199, టీడీపీకి 5,216
హైదరాబాద్: సీమాంధ్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం పార్టీ కొంత ముందంజలో ఉంది. మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్సార్ సీపీకి 275, టీడీపీకి 373 స్థానాలు వచ్చాయి. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ పీఠాలను వైఎస్సార్ సీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. మిగతా జిల్లాలను టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఓట్ల లెక్కింపు సాగింది. తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. గత పదేళ్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా జెడ్పీ ఎన్నికల్లో కనిపించలేదు. ఒక్క కర్నూలు జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. సీమాంధ్రలోని మిగతా 12 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీకి చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానం దక్కింది. ఇక.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పన ఇండిపెండెట్లు విజయం సాధించారు. మిగతా 11 జిల్లాల్లో ఎక్కడా ఇండిపెండెంట్లు సత్తా చూపలేకపోయారు. బీఎస్పీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా తదితర పార్టీలు పలు స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఎక్కడా ఒక్క జెడ్పీటీసీ స్థానాన్నీ గెలవలేకపోయాయి.
ఎంపీటీసీల ఫలితాలు ఇలా...
సీమాంధ్రలోని మొత్తం 10,092 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాలకు సంబంధించి న్యాయస్థానాల్లో వివాదాలు ఉండటంతో ఆయా స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరగలేదు. మిగతా 10,081 స్థానాల్లో టీడీపీ 5,216 స్థానాలను గెలుచుకోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ 4,199 స్థానాలను కైవసం చేసుకుంది. జెడ్పీటీసీల్లో కేవలం రెండే స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్.. ఎంపీటీసీల్లో కాస్తంత మెరుగ్గా 172 స్థానాలను గెలుచుకోగలిగింది. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కాంగ్రెస్‌కు రెండంకెల సీట్లు రాగా.. మిగతా జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ప్రకాశం జిల్లాలో బోణీ చేయలేకపోయింది. ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కంటే అధికంగా 428 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీల్లో సీపీఎం 24, సీపీఐ 14, బీజేపీ 13, బీఎస్పీ 2 స్థానాలను గెలుచుకున్నాయి.
జిల్లా మొత్తం వైఎస్సార్ తెలుగు కాంగ్రెస్ ఇతరులు
జెడ్పీటీసీలు కాంగ్రెస్ దేశం పార్టీ
}M>Mుళం 38 16 22 0 0
విజయనగరం 34 10 24 0 0
విశాఖపట్నం 39 15 24 0 0
తూర్పుగోదావరి 57 14 43 0 0
ప.గోదావరి 46 3 43 0 0
కృష్ణా 49 15 34 0 0
గుంటూరు 57 23 34 0 0
{పకాశం 56 31 25 0 0
నెల్లూరు 46 31 15 0 0
చిత్తూరు 65 27 37 0 1(జేఎస్పీ)
వైఎస్సార్ జిల్లా 50 39 11 0 0
కర్నూలు 53 30 20 2 1
అనంతపురం 63 21 41 0 1
మొత్తం 653 275 373 2 2
జిల్లా మొత్తం వైఎస్సార్ టీడీపీ కాంగ్రెస్ సీపీఐ సీపీఎం బీజేపీ ఇతరులు ఇండి పెండింగ్
ఎంపీటీసీలు కాంగ్రెస్ పెండెంట్లు
}M>Mుళం 675 276 351 8 1 1 0 1 37 0
విజయనగరం 549 169 297 60 0 0 1 0 0 0
విశాఖపట్నం 656 254 332 17 3 5 0 1 41 2 తూ.గోదావరి 1063 391 608 2 0 0 0 0 62 0
ప.గోదావరి 903 233 597 2 0 1 3 0 67 0
కృష్ణా 836 328 468 2 3 3 3 0 29 0
గుంటూరు 913 409 469 4 1 3 0 0 26 1 {పకాశం 790 405 344 0 0 0 0 1 34 6
నెల్లూరు 583 308 226 16 1 6 4 0 21 1
చిత్తూరు 901 387 459 4 0 1 1 0 49 0
వైఎస్సార్ జిల్లా 559 341 203 9 0 0 0 0 6 0
కర్నూలు 815 395 333 43 4 4 0 12 23 1
అనంతపురం 849 303 529 5 1 0 0 0 11 0
మొత్తం 10,092 4,199 5,216 172 14 24 13 15 428 11