సమైక్య రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు
రాబోయే సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ అన్నారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన ప్రక్రియ అయిపోతుందంటూ కొందరు చెబుతున్న మాటలు సరికాదని ఆయన చెప్పారు.
విభజన ప్రక్రియ ఇప్పటికి కేవలం 10 శాతం మాత్రమే జరిగిందని, ఇంకా 90 శాతం జరగాల్సి ఉందని మురళీకృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ ఆ ప్రాంతా నాయకులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, అలాంటి భ్రమలు కల్పించడం సరికాదని చెప్పారు.