పోటాపోటీ నినాదాలు, జలసౌధ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : హైదరాబాద్ జలసౌథ వద్ద శుక్రవారం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోటాపోటీ నినాదాలు, తోపులాటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత సీమాంధ్ర ఉద్యోగులు వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక నినాదంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. దీంతో జలసౌధ వద్ద ఉద్రిక్తమైంది.
ఇరు ప్రాంతాల ఉద్యోగులు తొపులాటకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు శాంతిపచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్రిక్త వాతారణం కొనసాగుతుండటంతో ఇరుప్రాంతాలకు చెందిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరోవైపు సచివాలయం వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.