అంతా రామయం!
శ్రీరామనవి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రామాయణంలో ఆసక్తికర ఘట్టాలను అర్చకులు వివరించారు. నీలమేఘశ్యాముడి ఏకపత్నీవ్రతాన్ని పాటలతో కీర్తించారు. పల్లెలో గ్రామోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. రామనామ జపంలో రామాలయాలు మార్మోగాయి. గ్రామాల్లో ఎద్దుల పందేలు, పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు.
- సాక్షి నెట్వర్క్