Seetharampuram
-
సీతారామపురం ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు సీరియస్
-
సీతారామపురం ఘటన.. విస్తుపోయే నిజాలు..
-
నంద్యాల జిల్లాలో YSRCP నేత దారుణహత్య
-
రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం సీతారాంపురం సమీపంలో బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు కథనం ప్రకారం.... బుధవారం తెల్లవారుజామున సీతారాంపురం నుంచి హైదరాబాద్‌కు గరిడె హరీశ్ (22) ఎలకొండ రజినీకాంత్ (24) హైదరాబాద్‌కు బైక్‌పై బయలుదేరారు. ఆ క్రమంలో వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి.... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
నెల్లూరులో మళ్లీ కంపించిన భూమి
► రెండు సెకన్లపాటు కంపించిన భూమి ► రెండు నెలల వ్యవధిలో ఏడోసారి భూ ప్రకంపనలు ► భయాందోళనలో ప్రజలు నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. శనివారం సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. రెండు నెలల వ్యవధిలో ఏడోసారి నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చినట్టు జీయోలిజకల్ నిపుణులు వెల్లడించారు. -
విద్యార్థి ఆత్మహత్య
కుక్కునూరు, న్యూస్‌లైన్: కళాశాల ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని సీతారాంపురం(రామచంద్రాపురం)లో చోటు చేసుకుంది. మృతుడి తల్లిదండ్రులు రామారావు, అనసూర్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సీతారాంపురానికి చెందిన పెరుమాళ్ల కిరణ్(19) అశ్వారావుపేటలోని వీకేడీవీఎస్ డిగ్రీ కళాశాలలో బీజడ్సీ ప్రథమసంవత్పరం చదువుతున్నాడు. దసరా సెలవులకు స్వగ్రామానికి వెళ్లిన అతనికి ‘అమ్మతల్లి’(పొంగు) సోకడంతో ఇంటి వద్దే ఉన్నాడు. అది తగ్గిన తర్వాత గురువారం అతను కళాశాలకు వెళ్లాడు. అతని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకోకుండానే ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో అతను ఆదివారం స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. అనంతరం పక్కకు వెళ్లి పురుగు మందు తాగాడు. తల్లిదండ్రులు అతనిని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. కిరణ్ మృతితో అతని స్నేహితులు, తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.