కుక్కునూరు, న్యూస్‌లైన్: కళాశాల ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని సీతారాంపురం(రామచంద్రాపురం)లో చోటు చేసుకుంది. మృతుడి తల్లిదండ్రులు రామారావు, అనసూర్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సీతారాంపురానికి చెందిన పెరుమాళ్ల కిరణ్(19) అశ్వారావుపేటలోని వీకేడీవీఎస్ డిగ్రీ కళాశాలలో బీజడ్‌సీ ప్రథమసంవత్పరం చదువుతున్నాడు.
దసరా సెలవులకు స్వగ్రామానికి వెళ్లిన అతనికి ‘అమ్మతల్లి’(పొంగు) సోకడంతో ఇంటి వద్దే ఉన్నాడు. అది తగ్గిన తర్వాత గురువారం అతను కళాశాలకు వెళ్లాడు. అతని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకోకుండానే ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో అతను ఆదివారం స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. అనంతరం పక్కకు వెళ్లి పురుగు మందు తాగాడు. తల్లిదండ్రులు అతనిని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. కిరణ్ మృతితో అతని స్నేహితులు, తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.
విద్యార్థి ఆత్మహత్య
Published Mon, Oct 28 2013 3:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement