లంచావతారం
= పలమనేరు ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు
= లెక్కలోకి రాని రూ.1.15 లక్షలు సీజ్
= నలుగురు ఏజెంట్లు, ఇద్దరు ఆఫీస్ బాయ్‌లపై కేసులు
పలమనేరు ఎంవీఐ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. కార్యాలయంలోని పలువురు ఏజెంట్లు, ఆఫీస్ సిబ్బంది నుంచి లెక్కలోకి రాని రూ.1.15,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ సమక్షంలోనే ఏజెంట్ల దందా జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు కాపుకాచి రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి సిబ్బందిని పట్టుకున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై తగు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
పలమనేరు,న్యూస్‌లైన్/గంగవరం, న్యూస్‌లైన్: పట్టణ సమీపం, గంగవరం మండల పరిధిలోని సాయినగర్ వద్ద ఉన్న పలమనేరు ఎంవీఐ (మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్) కార్యాలయం కొన్నాళ్లుగా అవినీతికి చిరునామాగా మా రి నట్ల్లు ఏసీబీ అధికారులకు సమాచారమందింది. కొన్ని రో జులుగా ఈ కార్యాలయంపై అధికారులు నిఘా ఉంచారు. బు ధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, రామకిషోర్, చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాం త్‌రెడ్డి ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసేశారు. అక్కడి రికార్డులను పరిశీలించి మొత్తం పన్నులు, ఇతరత్రాలకు సంబంధించిన మొత్తాన్ని లెక్కకట్టారు.
అనంతరం కార్యాలయం లోపలే ఉన్న పలువురు ఏజెంట్లు, ఆఫీస్ బాయ్‌లను తనిఖీ చేశారు. లెక్కలోకి రాని రూ.1,15,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు గోకుల శ్రీనివాస్, పచ్చినూలు రాజు, మేకల రమేష్‌బాబు, షేక సల్మాన్‌ఖాన్, ఆఫీస్ బాయ్స్ సయ్యద్ షఫీ, షేక్ రియాజ్ బాషాలపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఎంవీఐ కార్యాలయంలోనే ఎంవీఐ సమక్షంలోనే ఏజెంట్ల దందా జరుగుతోందంటే ఈ అవినీతి అక్రమాల వెనుక అధికారుల హస్తం ఉందనే విషయాన్ని వారు గుర్తించారు. దీంతో ఎంవీఐ మధుసూదన్‌ను సైతం విచారించారు. పూర్తి స్థాయిలో దాడులకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు సీఐలు తెలిపారు.
ఏసీబీ దాడులతో పలు కార్యాలయాల ఖాళీ
పలమనేరు ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు సాగుతున్నాయనే సమాచారంతో పలమనేరు, గంగవరం మండలాల్లోని పలు కార్యాలయాలు బోసిపోయాయి. గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు పలమనేరులో తిరుగుతున్నారనే పుకార్లు వినిపించాయి. దాంతో పాటు బుధవారం ఉదయం సైతం పలమనేరు తహశీల్దార్ కార్యాలయం వద్ద కొందరు ఏసీబీ అధికారులు తిరిగారు. దీంతో పలమనేరు, గంగవరం కార్యాలయాల్లోని పలువురు అధికారులు చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించారు. కొందరైతే కార్యాలయాల బయటే గడిపారు.
అనవసరంగా డబ్బులు పోయనే....
పలు ప్రాంతాలకు చెందినవారు లెసైన్సుల రెన్యూవల్స్, ట్యాక్సులు ఇతరత్రాల కోసం బుధవారం ఉదయం వేలాది రూపాయలు ఏజెంట్లకు అందజేశారు. అధికారులు దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనవసరంగా తమ డబ్బులు పోయూయంటూ అంటూ వారు ఆందోళన చెందారు. ఏజెంట్లను నమ్మినందుకు తమకు తగినశాస్తి జరిగిందంటూ కొందరు వెనుదిరిగారు.
అవినీతిపై సమాచారమందించండి...
ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి, అక్రమాలపై తమకు సమాచారమందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అధికారులెవరైనా లంచాల కోసం వేధిస్తున్నా, ఇత ర సమస్యలేమైనా ఉన్నా ప్రజలు తమ ఫోన్‌నెంబర్లు 944044 6120, 940446190. 9440446191,9440446193, 944044 6138, 9440808112లకు సమాచారం అందివ్వాలన్నారు.