self-driving cars
-
ప్రమాదాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఎలా స్పందిస్తాయి?
న్యూయార్క్: గూగుల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఆటోడ్రైవింగ్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మార్కెట్లోకి తెస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది ప్రజలు వీటిలో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మార్కెట్లోకి రావడం వల్ల రోడ్లపై 90 శాతం ప్రమాదాలు తగ్గిపోతాయని, ప్రమాదాల కారణంగా వైద్య చికిత్సలకు ఖర్చవుతున్న కోట్లాది రూపాయలు మిగిలిపోతాయని వీటికి డిజైన్ చేసిన ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. ప్రమాదం అనివార్యమైనప్పుడు, పాదాచారులో లేదా కారులో ప్రయాణిస్తున్న వారో ప్రమాదంలో మరణించే ఆస్కారం ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎలా స్పందిస్తుంది? పాదచారులను బలి చేస్తుందా లేదా కారులో కూర్చున్న వారిని బలి చేస్తుందా? పాదచారులు వృద్ధులైనప్పుడు ఎలా స్పందిస్తుంది? యువత అయినప్పుడు ఎలా స్పందిస్తుంది? అన్న నైతిక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. పాదచారులకు బదులు కారులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలనే త్యాగం చేయడం మంచిదని ఓ సైన్స్ పత్రికలో ప్రచురించిన ఓ సర్వే వెల్లడించింది. అందుకు ఓటేసిన వారిలో ఎక్కువ మంది సెల్ఫ్ డ్రైవింగ్ కారులో తిరగాలనుకునేవారు కాకపోవచ్చు. ఈ సంక్తిష్ట సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలోని ‘మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి చెందిన నిపుణులు ప్రయత్నించారు. ‘మోరల్ మిషన్’ పేరిట వారు కొన్ని చిత్రాలను వేసి డ్రైవింగ్ సీట్లో మనమే ఉంటే ఏం చేస్తాం? అని కొన్ని ప్రశ్నలు సంధించారు. * మొదటి రకం రెండు చిత్రాల్లో కారులో ప్రయాణికులు ఎవరూ ఉండరు. నలుగురు పాదాచారులు రోడ్డు దాటుతుంటారు. చిత్రంలో సూచించిన రెండు మార్గాల్లో ఎటు కారు వెళ్లినా ఇద్దరు పాదాచారులు చనిపోవడం ఖాయం. అప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం? * రెండవ చిత్రాల్లో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. రోడ్డుమీద ఐదు కుక్కలు వెళుతుంటాయి. ఒక మార్గంలో వెళిలే ఐదు కుక్కలు చనిపోతాయి, రెండో మార్గంలో వెళితే ఐదుగురు ప్రయాణికులు మరణిస్తారు. అప్పుడు ఏ మార్గం అనుసరించాలి? మనుషుల ప్రాణాలకే విలువివ్వాలి అనవచ్చు. మనషులాగా జంతువుల ప్రాణాలకు కూడా విలువివ్వాలనేవారు లేకపోలేదు. *మూడవ రకం చిత్రాల్లో ఓ కారులో ముగ్గురు ప్రయాణికులు వెళుతుంటారు. ఎదురుగా ముగ్గురు పాదచారులు వెళుతుంటారు. మొదటి చిత్రంలో సూచించిన మార్గంలో కారు వెళితే కారులోని ముగ్గురు ప్రయాణికులు మరణిస్తారు. రెండో మార్గంలో వెళితే ముగ్గురు పాదచారులు మరణిస్తారు. అప్పుడు ఏ మార్గంలో వెళ్లడం మంచిదో మీరే తేల్చండి! అని పరిశోధకులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నైతికంగా ఓ నిర్ణయం తీసుకోవడానికి మనకే చిక్కుముడి అయితే మనుషులు తయారు చేసిన సల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిర్ణయం సంక్లిష్టం కాదా? తుది నిర్ణయాన్ని వాటికే వదిలేస్తే మంచిదేమో! Why the father of the self-driving car left Google -
గూగుల్, ఉబర్ ల మధ్య ఒప్పందం
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రమోట్ చేయడానికి గూగుల్, ఉబర్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు కంపెనీలు సంకీర్ణంగా పనిచేయనున్నట్టు మంగళవారం ప్రకటించాయి. దీంతోపాటు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఫోర్డ్, వోల్వో లు కూడా ఈ సేప్టీ డ్రైవింగ్ కార్ల టెక్నాలజీ ప్రమోషన్ లో భాగస్వాములు కానున్నాయి. ఈ ఒప్పందానికి మాజీ అమెరికా నేషనల్ జాతీయరహదారుల ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డేవిడ్ స్ట్రిక్ ల్యాండ్ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో అమెరికన్ రహదారులు సురక్షితంగా, తక్కువ రద్దీగా మారుతాయని స్ట్రిక్ ల్యాండ్ చెప్పారు. ఫెడరల్ స్టాండర్డ్స్ కు అనుకూలంగా టెక్నాలజీ ప్రమోట్ ఆవిష్కరణను తీసుకొచ్చామని, విధాన నిర్ణేతలతో కలిసి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ ను విస్తరించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ చెక్ పెడతాయని, ప్రమాదాలు చాలా తగ్గుతాయని చెప్పారు. -
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకూ హ్యాకింగ్ ముప్పు
హెల్సింకీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు హ్యాకింగ్ ముప్పు ఉందా? ఉందని చెబుతున్నారు ఫిన్లాండ్కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎఫ్ సెక్యూర్’ సంస్థ నిపుణులు మిక్కో హిప్పోనెన్. ఇప్పటికే ఇలాంటి హ్యాకర్స్ ఉన్నారని, వారే రష్యాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ‘రాన్సమ్వేర్’ హ్యాకర్లని ఆయన తెలిపారు. వీరు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోని కంప్యూటర్ వ్వవస్థలోకి ప్రవేశించి, వైరస్ ఎక్కించడం ద్వారా కారు కంట్రోల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారని, కారు యజమాని రాన్సమ్ (వారు అడిగినంత డబ్బు చెల్లిస్తేనే) చెల్లిస్తేనే కారుకు మళ్లీ యాక్సెస్ కల్పిస్తారని హిప్పోనెస్ చెబుతున్నారు. రాన్సమ్వేర్ హ్యాకర్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను యాక్సిడెంట్లకు గురిచేస్తారన్న భయం తనకు లేదని, వారూ డబ్బుకోసం హ్యాకింగ్ చేసే తత్వానికి చెందిన వారని ఆయన చెప్పారు. డ్రైవర్‌లెస్ కార్లను తీసుకొచ్చేందుకు కొన్ని కంపెనీలు ఇప్పటికే పోటీ పడుతున్న విషయం తెల్సిందే. వాటిలో గూగుల్ కంపెనీ కాస్త ముందుండి తన డ్రైవర్‌లెస్ కారుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న విషయమూ తెల్సిందే. మరో రెండేళ్లలో డ్రైవర్‌లెస్ కార్లను తీసుకొస్తామని ‘టెల్సా మోటార్స్’ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. రానున్న కాలమంతా డ్రైవర్‌లెస్ కార్లదేనని, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 25 శాతం కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఉంటాయని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. మరి, ఈ హ్యాకింగ్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రక్షించుకోవడం ఎలా? అని హిప్పోనెన్ను ప్రశ్నించగా, ఎప్పటికప్పుడు పటిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకుంటూ పోవడమేనని, ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయగానే దానిలో ఉన్న లొసుగులను పట్టుకొని హ్యాకర్లు పుట్టుకొస్తుంటారని, వారి బారిన పడకుండా తప్పించుకొనేందుకు నిరంతర ప్రక్రియ అనువైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకుంటూ పోవడం ఒక్కటే దారని ఆయన అన్నారు. ఇటీవల గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాక్సిడెంట్‌కు గురవడం హ్యాకర్ల వల్ల జరగలేదని, ఎదురుగా వస్తున్న బస్సును సెన్సర్లు సరిగ్గా గుర్తించక పోవడం వల్లనే జరిగిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
గూగుల్ కారు రెడీ అవుతోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూపొందిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు సిద్ధమవుతోంది. 2020 నాటికి మార్కెట్లోకి వస్తోంది. డ్రైవర్ అవసరం లేని ఈ కారును అయిదేళ్లలో ప్రవేశపెట్టేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం అధిపతి క్రిస్ ఉర్మ్సన్ తెలిపారు. కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లేని కార్లతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘భద్రత పరంగా అత్యాధునిక టెక్నాలజీతో కార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంత వరకు మాత్రమే ప్రయాణికులకు రక్షణ కల్పిస్తాయి. అన్ని సందర్భాల్లోనూ కాదు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు విషయంలో అలాంటి సమస్యే లేదు’ అని చెప్పారు. అయితే తొలుత అమెరికా వంటి అగ్ర దేశాలకే ఈ కారు పరిమితం అవుతుంది. పోటీలో ఆపిల్ కూడా.. మరో టెక్నాలజీ సంస్థ ఆపిల్ సైతం సెల్ఫ్ డ్రైవింగ్ కారును తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ సంస్థ కూడా 2020 నాటికే కారును విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇద్దరు మాత్రమే ప్రయాణించే సెల్ఫ్ డ్రైవింగ్ కారు పూర్తిగా సాఫ్ట్వేర్ నియంత్రణలో రాడార్, సెన్సర్ల ఆధారంగా పనిచేస్తుంది. పరిసరాలను రాడార్ ఎప్పటికప్పుడు 3డీ చిత్రాల రూపంలో పంపిస్తుంది. ఇక స్మార్ట్‌ఫోన్‌తో కారు అనుసంధానమై ఉంటుంది. ఫోన్ ద్వారా రావాల్సిన, వెళ్లాల్సిన ప్రాంతం ఏమిటో ఆదేశిస్తే చాలు తన పని తాను చేసుకుపోతుంది. కారులో కూర్చున్నాక స్టార్ట్ బటన్ నొక్కగానే బయలుదేరుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆగాల్సి వస్తే రెడ్ బటన్ నొక్కితే చాలు. స్టీరింగ్, పెడల్స్ ఏవీ ఉండవు.