గూగుల్, ఉబర్ ల మధ్య ఒప్పందం
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రమోట్ చేయడానికి గూగుల్, ఉబర్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు కంపెనీలు సంకీర్ణంగా పనిచేయనున్నట్టు మంగళవారం ప్రకటించాయి. దీంతోపాటు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఫోర్డ్, వోల్వో లు కూడా ఈ సేప్టీ డ్రైవింగ్ కార్ల టెక్నాలజీ ప్రమోషన్ లో భాగస్వాములు కానున్నాయి. ఈ ఒప్పందానికి మాజీ అమెరికా నేషనల్ జాతీయరహదారుల ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డేవిడ్ స్ట్రిక్ ల్యాండ్ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో అమెరికన్ రహదారులు సురక్షితంగా, తక్కువ రద్దీగా మారుతాయని స్ట్రిక్ ల్యాండ్ చెప్పారు. ఫెడరల్ స్టాండర్డ్స్ కు అనుకూలంగా టెక్నాలజీ ప్రమోట్ ఆవిష్కరణను తీసుకొచ్చామని, విధాన నిర్ణేతలతో కలిసి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ ను విస్తరించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ చెక్ పెడతాయని, ప్రమాదాలు చాలా తగ్గుతాయని చెప్పారు.