నాడు టాప్ ఇంజినీర్.. నేడు ప్రధాన శత్రువు!
ఒకప్పుడు అతడు ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ లో ఓ స్టార్గా వెలిగాడు. ప్రస్తుతం గూగుల్ అనుబంధ కంపెనీ అల్ఫాబెట్ కి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. ఆ ఉద్యోగి పేరు ఆంథోనీ లెవన్ డౌస్కీ. 2013లో అల్ఫాబెట్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కీలక ఉద్యోగి. గూగుల్ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు రూపకల్పనలో ఆంథోనీ శ్రమించాడు. ఆపై అతడు వేరే కంపెనీకి మారాడు. ప్రస్తుతం ఉబర్ టెక్నాలజీస్ సొల్యూషన్స్, ఒట్టో అనే కంపెనీలతో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాడు.
అల్ఫాబెట్ కంపెనీ నుంచి వెళ్లిపోయిన ఆంథోనీ కొన్ని కీలక ప్రాజెక్టుల సమాచారాన్ని తస్కరించాడని ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్పై వేమో అనే ఉన్నతోద్యోగి దావా వేశారు. జనవరి 2016లో అల్ఫాబెట్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ కంపెనీలో పనిచేసే సమయంలో కీలక సమాచారాన్ని తన వద్ద హార్డ్ డిస్క్ లో కాపీ చేశారని, ప్రస్తుతం తన కంపెనీలో ఆ డాటాను వాడుతున్నట్లు గూగుల్ ఉద్యోగి అల్ఫాబెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.
ఆంథోనీ సొంత కంపెనీ ఉబర్ లో కోర్ బిజినెస్, మ్యాపింగ్స్ విషయాల్లో, తస్కరించిన డాటా వినియోగిస్తున్నారని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై రొబోటిక్ కార్లను నడిపించాలని ఆంథోనీ కలలు కనేవాడు. 2004లో సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ ను విజయవంతంగా రన్ చేసి ప్రాచుర్యం పొందాడు. ఆపై గూగుల్, దాని అనుబంధ కంపెనీ అల్ఫాబెట్ లో జాబ్ చేశాడు. గతేడాది జనవరి 16న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఉబర్ సొల్యూషన్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిరావడాన్ని ఉద్యోగులు యాజమాన్యానికి తెలిపారు. ఆ పై రెండు వారాలకే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జాబ్ మానేశాడని తమ దావాలో అల్ఫాబెట్ సంస్థ పేర్కొంది.