కష్టాలకు చెక్
తాడేపల్లిగూడెం/ఏలూరు (మెట్రో) : పెద్ద నోట్ల రద్దు అనంతరం కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు కొంత ఊరట లభించింది. రైతులు వారి ఖాతాల నుంచి రూ.25 వేల వరకు నగదు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇటు జిల్లా అధికారులు.. అటు కమీష¯ŒS వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలకు వీలైనంత త్వరగా నగదు జమ చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు కమీష¯ŒS వ్యాపారులు రైతులకు బ్యాంక్ చెక్కులిచ్చి మరీ ధాన్యం కొంటున్నారు. దీంతో శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ కళ్లాలు, రోడ్ల వెంబడి రాశులుగా పోసి ఉంచిన ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాలు, మిల్లుల వైపు వేగంగా కదులుతున్నాయి. జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో శుక్రవారం ఒక్కరోజే 3,985 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కమీష¯ŒS దారులు, మిల్లర్లు సైతం పెద్దఎత్తున ధాన్యం కొన్నారు. ఒక్క తాడేపల్లిగూడెం ప్రాంతం నుంచే సుమారు 300 లారీల ధాన్యం మిల్లులకు తరలిం దని అంచనా. కమీష¯ŒSదారులు గతంలో ధాన్యం తీసుకెళ్లిన నాలుగైదు రోజుల అనంతరం రైతులకు నగదు చెల్లించేవారు. ఇప్పుడు చిల్లర నోట్లు, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం కొన్న మొత్తానికి బ్యాంకు చెక్కు ఇస్తున్నారు. వాటిని రైతులు వారి బ్యాంక్ ఖాతాల్లో వేసుకోవడం ద్వారా నగదు పొందే అవకాశం ఏర్పడటంతో అమ్మకాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి.
ధర ఫర్వాలేదు
ఈసారి ధర విషయంలో రైతులకు కొంత బాగానే ఉంది. కమీష¯ŒSదారులు ఆరబెట్టిన ధాన్యం బస్తా (75 కేజీలు)కు రూ.1,120 చెల్లిస్తున్నారు. యంత్రంతో కోసిన ఆరుదల లేని ధాన్యానికి రూ.980 ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బస్తాకు రూ.18 వరకు అదనంగా రైతులకు లభిస్తోంది. కేరళ నుంచి ఉప్పుడు బియ్యానికి డిమాండ్ ఉండటంతో మిల్లర్లు, కమీష¯ŒSదారులు అనుకూలమైన ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఫలితమిస్తున్న ఉపశమన చర్యలు
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఉపశమన చర్యలు ప్రకటించింది. పంట రుణం పొందిన లేదా కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చు. పంట అమ్మగా వచ్చిన సొమ్ము ఆర్టీజీఎస్ లేదా చెక్కు ద్వారా రైతు ఖాతాలోకి వచ్చి ఉంటే, వారానికి అదనంగా మరో రూ.25 వేలు తీసుకోవచ్చు. అంటే ఇలాంటి సందర్భాల్లో రైతు గరిష్టంగా వారానికి రూ.50 వేలు తీసుకునే అవకాశం ఉంది. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటం, రబీ సీజ¯ŒS సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఈ ఉపశమన చర్యలు రైతులకు ఊరట ఇస్తున్నాయి. అయితే, సహకార సంఘాల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడంతో వాటిలో ఖాతాలున్న రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
సొమ్ము చెల్లింపుల్ని వేగవంతం చేశాం
ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజనూ కొనేలా ఏర్పాట్లు చేశాం. చెల్లింపులను వేగవంతం చేశాం. గడచిన 10 రోజుల్లో 14,241 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, శుక్రవారం ఒక్కరోజే 3,985 మెట్రిక్ టన్నులు కొన్నాం. 1,286 మంది రైతులకు రూ.20.93 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.11.70 కోట్లు చెల్లించాం. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన చర్యలు వారికి ఉపశమనం కల్పించాయి.
– ఎం.గణపతి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ