సరుకులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరిక
మడకశిర రూరల్ : కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000నోట్ల రద్దుతో వాటిని మార్చుకోవడానికి జనం ఇబ్బందులు పడుతున్న తరుణంలో దుకాణదారులు ఉప్పు«, నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జనచైతన్యయాత్ర జరిగింది. ఈ యాత్రకు ముఖ్యఅతిథిగా మంత్రి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారడీ మాటలను ప్రజలు నమ్మరన్నారు. మడకశిర ప్రాంతంలోని చెరువులకు వచ్చే ఏడాది నీరునింపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మండల ఉపా«ధ్యక్షురాలు ధనలక్ష్మీ, ఎంపీపీ అరుణఆదినారాయణ, మండల టీడీపీ కన్వీనర్ రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.