semi-autonomous
-
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్‌పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్‌తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్‌కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిమ్స్ సెమీ అటానమస్ రద్దు !
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: రిమ్స్ వైద్యశాల, కళాశాల సెమీ అటానమస్ హోదా త్వరలో రద్దు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసినట్లు సమాచారం. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 30వ తేదీ అనంతరం ఎటువంటి కాంట్రాక్టు ఉద్యోగుల నియామక ప్రక్రియ చేపట్టకూడదు. ప్రస్తుతం ఉన్న వారికి కూడా పొడిగింపు ఉత్తర్వులు ఉండవు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. 37 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల, వైద్యశాల నిర్మించారు. నాలుగో సంవత్సరం తరగతులకు ఎంసీఐ అనుమతుల కోసం ఇంకా నిర్మాణాలు సాగుతున్నాయి. రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా తీర్చిదిద్దాలని 2008లో ప్రభుత్వం జీఓ విడుదల చేసి సెమీ అటానమస్ హోదా కల్పించారు. ప్రస్తుతం రిమ్స్‌లో 106 మంది కాంట్రాక్టు వైద్యులుండగా 19 మంది మాత్రమే రెగ్యులర్ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరుకాక 350 మంది వరకూ నర్సింగ్ సిబ్బంది, మరో 200 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సెమీ అటానమస్ హోదా రద్దయితే ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలే రిమ్స్‌ను పర్యవేక్షిస్తారు. అయితే తమ పరిస్థితి ఏంటని కాంట్రాక్టు, ఓట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రిమ్స్ వైద్యకళాశాలల్లో సెమీ అటానమస్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ రంగంలోని వారినే ఉద్యోగులుగా నియమించాలనే ఆలోచన ఉండటంతో ఈ విధానం కింద పని చేస్తున్న వారంతా తమ వ్యక్తిగత ఉద్యోగ భద్రత కోసం తలో దారి చూసుకుంటున్నట్లు సమాచారం. రిమ్స్‌లో పనిచేసేందుకు ఎవరూ మిగలరు.. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య సెమీ అటానమస్ రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కానీ ఇప్పటి కిప్పుడు అందరినీ తీసివేస్తే, రిమ్స్‌లో పని చేయడానికి ఎవరూ మిగలరు. కొంత మంది సీనియర్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం మరో ఏడాది పాటూ పొడిగింపు ఉత్తర్వులను మంజూరు చేసింది.