senior political leader
-
‘ముఖ్యమంత్రి’ అలక!.. కాంగ్రెస్‌కు రాజీనామా
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్ణాటక సీనియర్ నేత హెచ్ఎన్ చంద్రశేఖర్ అలియాస్ ముఖ్యమంత్రి చంద్రూ, పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్‌కు పంపాడు. కాంగ్రెస్‌కు ఉన్న చారిత్రక నేపథ్యం చూసి పార్టీలో చేరానని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని ఆయన రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. హెచ్ ఎన్ చంద్రశేఖర్.. కన్నడ నటుడు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించారు. ఎక్కువగా ఆయన సీఎం పాత్ర పోషించడంతో ‘ముఖ్యమంత్రి చంద్రూ’గానే ఆయన పాపులర్ అయ్యాడు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. జనతా పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గౌరీబిదానర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 1998 నుంచి 2004 దాకా ఎమ్మెల్సీగా కొనసాగారు. అటుపై 2013 వరకు కన్నడ డెవలప్మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీలో చేరారు. HN Chandrashekar కర్ణాటక తరపున రాజ్యసభ సీటు ఆశించారు. అయితే నిరాశ ఎదురుకావడంతోనే ఆయన పార్టీ వీడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రు అలకను కాంగ్రెస్ నేతలు కొందరు ధృవీకరించారు కూడా. అయితే ఆయన మాత్రం వ్యక్తిగత కారణం అని మాత్రమే చెబుతున్నారు. -
Oscar Fernandes: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతి
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ కన్నుమూశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండేస్ మృతిపై సదరు ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఫెర్నాండేజ్ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. Anguished by the passing away of Rajya Sabha MP and senior Congress leader, Shri Oscar Fernandes. Condolences to his family, friends and supporters. Om Shanti! — Rajnath Singh (@rajnathsingh) September 13, 2021 ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ఒక విద్యావేత్త., రోక్ ఫెర్నాండెజ్ మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ తల్లి లియోనిస్సా ఫెర్నాండెజ్ భారతదేశంలో మొదటి మహిళా మేజిస్ట్రేట్. కాగా ఫెర్నాండేజ్ 1975-76లో ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఉడిపి నుంచి 1980లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం అయిదుసార్లు (1980, 1984, 1989, 1991, 1996) ఆయన ఉడిపి నుంచి ప్రాతినిధ్యం వహించారు. My heartfelt condolences to the family and friends of Shri Oscar Fernandes Ji. It is a personal loss for me. He was a guide and mentor to many of us in the Congress Party. He will be missed and fondly remembered for his contributions. pic.twitter.com/NZVD592GSJ — Rahul Gandhi (@RahulGandhi) September 13, 2021 ఫెర్నాండెజ్ 1984-85లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అంత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. విదేశాంగ వ్యవహారాలు, యూత్ అండ్ స్పోర్ట్స్, గణాంకాలు వాటి అమలు ప్రోగ్రాం, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖల బాధ్యతలు చూశారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఫెర్నాండెజ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2004లో కూడా మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం -
కాకలు తీరిన నేత.. డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధర్మపురి శ్రీనివాస్. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు చక్రం తిప్పిన కాకలుతీరిన రాజకీయ యోధుడు. కాంగ్రెస్‌లో చిరకాలం కొనసాగి, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సారథిగా 2 సార్లు పని చేశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనేక ఎత్తుపల్లాలను చవి చూశారు. తొలుత బ్యాంకు ఉద్యోగి అయిన డీఎస్, 1983లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి చవిచూశారు. మొత్తం ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలిచినా 1994లో ఓడిపోయారు. 1999, 2004ల్లో వరుసగా గెలుపొందారు. మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వహించారు. 1995-1998ల మధ్య పీసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1999లో నిజామాబాద్ నుంచి రెండోసారి గెలిచి 2003 వరకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, 2003-2004, 2008-2011 మధ్య పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. బలమైన బీసీ నేతగా ఎదిగినా... నిజామాబాద్ లో ఆయనపై నెలకొన్న వ్యతిరేకత డీఎస్ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు డీఎస్ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా నిజామాబాద్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఎదురుదెబ్బ అయింది. తర్వాత ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లోనూ డీఎస్‌ను విజయం వరించలేదు. 2014 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2011లో ఎమ్మెల్సీగా అవకాశం రాగా, 2014 జులై నుంచి 2015 మార్చి వరకు మండలిలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. 2015 జులై 8న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.