శాస్త్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
పాపన్నపేట: రైతులు అనుకరణ విధానానికి స్వస్తి చెప్పి శాస్త్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ శాస్త్రవేత్త రాఘవయ్య అన్నారు. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో మంగళవారం జరిగిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతు రైతులు మొదట భూసార పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులో సేంద్రియ, రసాయన ఎరువులు వాడాలని, విత్తనశుద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ రమేష్ ఏడిఏ మనోహర, జిల్లా వ్యవసాయాధికారి పరశురాములు, ఏఓలు శోభ, శిరీష, రమేష్, నెలవంక, రైతులు పాల్గొన్నారు.