అమ్మను ‘చంపేశారు’
నవమాసాలు మోసి కని, పెంచిన తల్లి ఆ కొడుకులిద్దరికీ భారమైంది. ఆమె ఆస్తిని పంచుకున్న అన్నదమ్ములు బాగోగులు చూడడం మరిచారు. బుక్కెడన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు. వృద్ధాప్యంలో వండుకుని తినే ఓపిక లేని ఆమె పలుమార్లు అస్వస్థతకు గురై శనివారం రాత్రి ఈ లోకాన్ని విడిచివెళ్లింది.
రామగుండం, న్యూస్‌లైన్ : రామగుండం పాతబజార్‌కు చెం దిన గద్ద రత్నయ్య- రుక్కమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రత్నయ్య సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసి కొంతకాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారులు రాజన్న, శ్రీనివాస్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ఆస్తిని పం చుకుని తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆమెను ఒక్కదానికి పెద్ద ఇల్లు ఎందుకని చెప్పి బయటకు పంపా రు. ఓ రేకులషెడ్డు వేసిచ్చి, ఇంటిని అద్దెకిచ్చారు. వచ్చిన డబ్బులను కలిసి పం చుకుంటున్నారు.
కానీ తల్లి బాగోగులు చూడడం మరిచారు. వృద్ధాప్యంలో సత్తువ లేకుండా ఉన్న ఆమెకు ఇరుగుపొరుగు వారు అన్నం పెడుతున్నారు. పలుమార్లు అస్వస్థతకు గురైనా వారే ది క్కయ్యారు. ఇటీవల రుక్కమ్మ(70)కు జ్వరం రావడం, ఆరోగ్య పరిస్థితి మరిం త దిగజారడంతో స్థానికులు కుమారులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీ సులకు చెప్పారు. తబితా ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ ఆగస్టు 20న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఎస్సై అక్కడకు కు మారులను పిలిచి మందలించారు. తల్లి వెంట ఉండి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పారు. రెండురోజులపాటు చికి త్స చేయించిన వారు ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రుక ్కమ్మ అస్వస్థతతో కన్నుమూసింది.
కుమారులపై కేసు..
కొడుకులు ఆదరించకపోవడంతోనే రుక్కమ్మ చనిపోయిందని, తమ విచారణలో ఈ విషయం వెల్లడైందని ఎస్సై శ్రీను తెలిపారు. వారిపై మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్-2007, సెక్షన్-24 కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే వారిద్దరిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.