దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ దారుణ హత్య!
జోహెనెస్ బర్గ్: దక్షిణాఫ్రికా పుట్ బాల్ కెప్టెన్ సెంజో మెయివా దారుణ హత్యకు గురయ్యాడు. జోహనెస్ బర్గ్ లో వోస్లూరస్ లోని ఓ టౌన్ షిప్ లో అగంతకులు సెంజోను అగంతకులు కాల్చి చంపినట్టు స్తానిక మీడియా వెల్లడించింది. తన ప్రియురాలు కెల్లీ ఖుమాలో నివాసంలోకి ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లోకి చొరబడిన ఇద్దరు అగంతకుల బారి నుంచి తన ప్రేయసిని రక్షించుకోవడానికి అడ్డుపడిన సెంజోను దారుణంగా కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇంటి బయట కాపలా కాస్తున్న వ్యక్తితో కలిసి పరారైనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
మొబైల్ ఫోన్ ఇవ్వమని సెంజోను చొరబాటుదారులు డిమాండ్ చేసినట్టు స్థానిక మీడియా తన కథనంలో వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన సెంజో మెయివాను ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస వదిలారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీసెస్ ఓ ట్విటర్ లో వార్తను పోస్ట్ చేశారు. ది ఓర్లాండో పైరేట్స్ జట్టుకు కెప్టెన్ గా, గోల్ కీపర్ గా సెంజో మెయివా వ్యవహరించారు.