ఎవరి ఎంసెట్ వారిదే...
హైదరాబాద్ : ఇరురాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఎంసెట్ పరీక్షను విడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుమారు అయిదు గంటల పాటు సాగిన సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
ప్రధానంగా ఎంసెట్‌ను వేరుగానే నిర్వహించాలని ఏపీ కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వేర్వేరుగానే ఎంసెట్‌ను నిర్వహించుకోనున్నాయి. అలాగే కొత్త సౌర విద్యుత్ విధానంతో పాటు అక్రమ కట్టడాల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మరోసారి భేటీ కావాలని కేబినెట్ నిర్ణయించింది.