seperate couple
-
అత్యంత దురదృష్టవంతులు వీరే.. ఏకంగా రూ.31 కోట్లు మిస్సయ్యారు
లండన్: లాటరీ టికెట్ అంటే ఓ రకంగా చెప్పాలంటే జూదం. లక్షల్లో టికెట్ కొంటే ఒక్కరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అలా మన ఇంటికి వచ్చిన అదృష్టాన్ని.. మన చేతులారా మనమే పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది.. ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు బ్రిటన్‌కు చెందిన మార్టిన్ టాట్ అతడి భార్య కే. వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో వీరికంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరని జాలిపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ జంట కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. అది కూడా ఏ కోటి, రెండు కోట్లో కాదు.. ఏకంగా 31 కోట్ల రూపాయలు. కానీ ఏం లాభం వారి దగ్గర ఆ టికెట్ లేదు. లాటరీ తగిలిన ఆనందం కన్నా టికెట్ పొగుట్టుకున్న విషమే వారిని ఎక్కువ బాధించింది. 20 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పటికి వారిని ఎంతో బాధిస్తుంది. ఆ వివరాలు.. (చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు) ఇరవై ఏళ్ల అనగా 2001 సంవత్సరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్టిన్, అతడి భార్య కే ప్రతి వారం లాటరీ గేమ్‌లో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఓ సారి అదృష్టం బాగుండి కే కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. దాని విలువ ఏకంగా 31 కోట్ల రూపాయలు. ఇక తమ కష్టాలు అన్ని తీరిపోతాయి.. కోటీశ్వరులం అవుతామని కలలు కంటున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కే కొన్న లాటరీ టికెట్ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో కే లాటరీ నిర్వహిస్తున్న యాజమాన్యం దగ్గరకు వెళ్లి.. తాను కొన్న టికెట్‌కే లాటరీ తగిలిందని.. కావాలంటే తన టికెట్ నంబర్ని కంప్యూటర్లో చెక్ చేయవచ్చని కోరింది. కానీ సదరు కంపెనీ ససేమిరా అన్నది. టికెట్‌ని తీసుకువచ్చి చూపిస్తేనే ప్రైజ్‌మనీని ఇస్తామని స్పష్టం చేసింది. 30 రోజుల్లోపు పోగొట్టుకున్న టికెట్‌ని తీసుకువస్తే.. ప్రైజ్‌మనీని వారికి అందజేస్తామంది. కానీ దురదృష్టం కొద్ది టికెట్ దొరకలేదు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. చేతికొచ్చిన ముద్ద నోటికందకుండా పోయిందే అంటూ కే దంపతుల పరిస్థితిపై జాలి పడ్డారు జనాలు. (చదవండి: యూరోకప్ టోర్నమెంట్ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు) ఈ లాటరీ ప్రైజ్‌మనీ కోసం కే దంపతులు ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేశారు. కానీ లాభం లేకుండాపోయింది. ఈ క్రమంలో వారి మధ్య బంధం కూడా బీటలు వారింది. 31 కోట్ల రూపాయలు చేతికందకుండా పోయాననే బాధతో ఇరువురు ఒకరినొకరు దూషించుకోసాగారు. అలా వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. చివరకు వారిద్దరు విడాకులు తీసుకున్నారు. పాపం లాటరీ ప్రైజ్‌మనీ దక్కలేదు.. ఇటు వివాహ బంధం నిలవలేదు. వీరి గురించి విన్న ప్రతి ఒక్కరు ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు వీరేనని సానుభూతి చూపుతారు. చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు -
విడాకులకు కారణం అక్కర్లేదు: హైకోర్టు
భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని అనుకుంటే.. కోర్టు అందుకు కారణాలు వెతకాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నిజనిర్ధారణ కోసం పట్టుబట్టనక్కర్లేదని జస్టిస్ కేకే శశిధరన్, జస్టిస్ ఎన్.గోకుల్‌దాస్‌లతో కూడిన డివిజన్ బెంచి తెలిపింది. వివాహబంధం విఫలమైనప్పుడు దాన్ని తెంచుకోవాలని ఇద్దరూ భావిస్తే, కోర్టు కూడా వాళ్ల సెంటిమెంట్లను గౌరవించి విడాకులు మంజూరు చేయాలని, అందుకు కారణాలు వెతుకుతూ విడాకులు నిరాకరించడం సరికాదని న్యాయమూర్తులు చెప్పారు. దాదాపు ఏడాదికి పైగా వేర్వేరుగా జీవిస్తున్న దంపతులు సంయుక్తంగా దాఖలుచేసిన విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ తిరునల్వేలి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. కలిసి జీవించడం సాధ్యం కాదని వాళ్లు నిర్ణయించుకున్న తర్వాత.. విడాకులు తీసుకోవాలని వాళ్లు భావిస్తే అవి మంజూరు చేయడమే నయమని చెప్పింది. ఈ కేసులో యువతీ యువకులు 2013 మేలో పెళ్లి చేసుకున్నారు. కానీ, 2014 జూలై నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2015లో ఇద్దరూ కలిసి విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అయితే విడిపోవడానికి కారణాలు చెప్పలేదంటూ ఫ్యామిలీకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దానిపై వాళ్లు మద్రాసు హైకోర్టుకు వెళ్లగా కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ఏడాది ముందునుంచి వాళ్లు విడిగానే ఉంటున్నారు కాబట్టి ఇక కలిసి జీవించే అవకాశం లేదని, ఇక వాళ్లకు విడాకులు మంజూరు చేయడం తప్ప కోర్టుకు కూడా వేరే అవకాశం లేదని న్యాయమూర్తులు తెలిపారు.