ఇది అసమర్థ ప్రభుత్వం
వీరపునాయునిపల్లె: రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనా«థరెడ్డి అన్నారు. సెప్టెంబర్ 3న నిర్వహించే మహా ధర్నాపై చర్చించేందుకు బుధవారం ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక ప్రజలతో పనేముంది అనే రీతిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2012 రబీ సీజన్ బుడ్డశెనగ బీమా జిల్లాలో ఇంకా 13 వేల మందికి అందలేదని అన్నారు. సీఎం ఇప్పటివరకు 14 సార్లు జిల్లాలో పర్యటించినా అభివద్ధి ఏమాత్రం లేదన్నారు. జిల్లాపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపుతున్నాడని విమర్శించారు. వైఎస్ హయాంలో నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపడం లేదన్నారు. గండికోటకు నీరు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో చిత్తశుద్ది చూపడం లేదని అన్నారు. సెప్టెంబర్ 3న కడప కలెక్టరేట్ ఎదుట జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి హాజరువుతారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, మండల నాయకులు అలిదెన వాసు, విశ్వనాధరెడ్డి, రైతు విభాగం మండల అ«ధ్యక్షుడు బాస్కరరెడ్డి, çపార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.