రేపటి నుంచి ఏపీపీఎస్సీ మెయిన్ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న జరుగుతున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్డబ్ల్యూఓ) మెయిన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయా కేంద్రాల ప్రిన్సిపాళ్లు, లైజన్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె మంగళవారం సమీక్షించారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు తర్వాత మధ్యాహ్నం 1.30 గంటకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరాదన్నారు. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో ఏఎస్ఓ, ఏబీసీడబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ పరీక్షలు గుత్తిలోని గేట్స్ కళాశాలలో ఉంటాయని పేర్కొన్నారు.
హెచ్డబ్ల్యూఓ పరీక్ష కేంద్రాలు
+ పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల రుద్రంపేట, సనప రోడ్డు, అనంతపురం
+ శ్రీ షిరిడీసాయి ఇంజనీరింగ్ కళాశాల, పొడరాళ్ల, బుక్కరాయసముద్రం
+ ఎస్వీఐటీ ఇంజనీరింగ్ కళాశాల, హంపాపురం, రాప్తాడు
+ చిరంజీవిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, బళ్లారి రోడ్డు, రాచానపల్లి
+ గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల, గుత్తి అనంతపురం, పెద్దవడుగూరు మండలం