సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..
మన సరదాగా వన్యమృగాలతో చూడాలనో లేక సరదాగడుపదామనో మనం నేషలనల్ జూలాజికల్ పార్క్‌లు వంటి రకరకాల పార్కులకి వెళ్తాం. అయితే పార్క్‌లో ఉండే సంరక్షణాధికారులు సూచించినట్లుగా అక్కడ ఉన్న జంతువులతో జాగ్రత్తగా మసులుకోకపోతే చేదు అనుభవాలను ఎదర్కొక తప్పదు.
(చదవండి: ఇదేం ట్రెండ్....చెత్త వేసే సంచిని ధరించడం ఏమిటి ?)
అంతేకాదు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్న వాళ్ల గురించి ఇటీవల కాలంలో చాలానే విని ఉన్నాం. అయినప్పటికి పర్యాటకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి ఎందుకు తెచ్చకుంటారో అర్ధంకాదు. అట్లాంటి చేదు అనుభవమే టాంజానియా పార్క్‌కి వెళ్లిన ఒక పర్యాటక బృందానికి ఎదురైంది. అసలు ఎక్కడ జరిగింది ఏమైంది చూద్దాం రండి.
వివరాల్లోకెళ్లితే....టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఒక పర్యాటక బృందం కారులో కూర్చోని సింహాన్ని చూస్తుంటారు. అయితే ఆ సింహం వాళ్ల కారు పక్కనే ఉన్నప్పటికీ అది ఆ కారుని గమనించ కుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. దీంతో ఒక పర్యాటక బృందంలోని ఒక వ్యక్తి కారు కిటకి డోరు తీసి సింహాన్ని తాకడానికి ప్రయత్నించడమే కాక ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు.
ఇక అంతే ఒక్కసారిగా సింహం పెద్దగా గాండ్రిస్తూ కిటికిలోకి తల దూర్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సదరు పర్యాటకుడు షాక్‌కి గురై సీటు వెనక్కి వెళ్లి పోతాడు. ఇంతలో కారులో ఉన్న మిగతావాళ్లంతా కిటికి మూసేయ్ అంటూ కేకలు వేయడంతో కిటికిని మూసేయడానికి చాలా కష్టపడతాడు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర జంతువులతో తస్మాత్ జాగ్రత్త.
(చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో)