ఇక వెరైటీ కావాలి!
సీరియస్ పాత్రలంటే టబు చేయాల్సిందే అన్నట్లుగా ఉంది హిందీ రంగంలో. డేవిడ్, జయహో, హైదర్... వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేసిన టబు త్వరలో విడుదల కానున్న ‘దృశ్యం’లో పోలీసాఫీసర్‌గా చేశారు. ఇది కూడా సీరియస్ క్యారెక్టరే. ఇవి నటనకు అవకాశం ఉన్న పాత్ర లైనప్పటికీ ఇలా వరుసగా ఒకే తరహా పాత్రలు చేయడం టబూకి విసుగ్గా ఉందట. ఈ విషయం గురించి ఆమె చెబుతూ -‘‘కొన్నేళ్లుగా నేను సీరియస్ పాత్రలకే పరిమితమైపోయాను. ఇలాంటి పాత్రలంటే చాలు దర్శక, నిర్మాతలు నన్ను సంప్రతిస్తున్నారు. అలా కాకుండా, వేరే వైవిధ్యమైన పాత్రలు కూడా ఇస్తే బాగుంటుంది. నాలో ఉన్న నటిని ఇంకెంత వైవిధ్యంగా చూపించవచ్చు అనే అంశం మీద దృష్టి పెడితే రొటీన్ పాత్రల నుంచి నాకు రిలీఫ్ దక్కుతుంది’’ అన్నారు.