కంపెనీలకు సైబర్ ముప్పు
గత ఏడాదిలో భారత్‌లోని 72 శాతం కంపెనీలు ఏదో ఒకరూపంలో సైబర్ దాడికి గురయ్యాయి. 63 శాతం సంస్థలు తమకు ఆర్థికనష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి.
హ్యాకర్లు... ఆయా కంపెనీల సర్వర్లపై, కంప్యూటర్ నెట్‌వర్క్‌పై దాడి చేసి నష్టం కలిగిస్తున్నారు.కెపీఎంజీ సైబర్ క్రైమ్ సర్వే- 2015లో ఈ విషయం తేలింది. సర్వేలో వెల్లడైన అంశాలివీ...
►94% కంపెనీలు తమకు ప్రధానముప్పులో ఒకటిగా సైబర్ క్రైమ్‌ను పేర్కొన్నాయి.
►41% కంపెనీలు తమ బోర్డు సమావేశాల ఎజెండాలో సైబర్‌క్రైమ్ చర్చనీయాంశంగా ఉందని చెప్పాయి.
►74% బ్యాకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ రంగమే ప్రధాన టార్గెట్ అని కంపెనీలు అభిప్రాయపడ్డాయి.
►64% డెరైక్టర్లు లేదా మేనేజ్మెంట్పై ఎక్కువగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని కంపెనీలు చెప్పాయి.
కంపెనీలపై ప్రభావం
► 63% ఆర్థిక నష్టాలు
► 53% కొత్త ఆలోచనలు, కీలక డాటా చోరీ
► 49% సంస్థ పేరు దెబ్బతినడం
► 47% వ్యాపార ప్రక్రియకు విఘాతం
► 27% నియంత్రణ సంస్థ దృష్టిలో ఉల్లంఘనలు
► 11% ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతినడం
► 8% ఇతరాలు