జీఎం గారు.. ఆలకించరూ..
ఫుట్ఓవర్ బ్రిడ్జి లేక శివనగర్‌వాసుల తిప్పలు
కానరాని డిస్‌ప్లేబోర్డులు, టీవీలు
నేడు వరంగల్ రైల్వే స్టేషన్‌కు జీఎం రాక
ఎంతో ఆదాయం సమకూర్చుతున్నా పలు రైల్వేస్టేషన్లను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ఆవశ్యకత ఎక్కువగా కన్పిస్తోంది. కానీ ఈ దిశగా చర్యలు శూన్యం. ప్లాట్‌ఫాంలు కూడా నిర్మించాల్సి ఉన్నా పట్టించుకున్న నాథుడు లేడు. కొన్నిచోట్ల నిధులు మంజూరైనా పనులు జరగని పరిస్థితి. నేడు జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ సందర్శించనున్నారు. తమ కష్టాలను ఇప్పటికైనా పట్టించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మట్టెవాడ: నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు.. వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే వరంగల్ రైల్వేస్టేషన్లో వసతులు కరువయ్యూరుు. శివనగర్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదు. వరంగల్ బస్టాండుకు వచ్చే వారికి రైల్వేస్టేషన్లో టీటీఈలు తరచూ ఫైన్లు కూడా రాస్తున్నారు. కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాకుంటే రైల్వే ప్లాట్ ఫాం-1 నుంచి 3 వరకు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని శివనగర్, వరంగల్ బస్టేషన్ వరకు పొడిగించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఏ రైలు ఎన్నిగంటలకు వస్తుందో.. ఏరైలు బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియక తికమకపడుతున్నారు. వీటి వివరాలుండే డిస్ప్లే బోర్డులు రెండేళ్లుగా కన్పించడం లేదు.టీవీలూ లేవు, సరిపడా మంది టీటీఈలు వరంగల్ స్టేషన్లో లేరు.
రైల్వే స్టేషన్‌కు భద్రత కూడా కరువైంది. స్టేషన్‌కు వచ్చే ప్రయూణికులు ప్రధాన ద్వారం నుంచి వచ్చి టికెట్ తీసుకుని ప్లాట్ ఫాంకు వెళ్లాలి. అలాగే రైలు నుంచి దిగిన ప్రయూణికులు స్టేషన్‌లోని ఎగ్జిట్ గేటు నుంచి బయటకు వెళ్తారు. కానీఇక్కడ మాత్రం స్టేషన్‌కు అటు శివనగర్ వైపు, ఇటు వరంగల్ వైపు ఎన్నోదారులున్నాయి.
చింతలపల్లి, డోర్నకల్‌లోనూ..
సంగెం: చింతలపల్లి రైల్వేస్టేషన్‌ను రైల్వే జీఎం శ్రీవాస్తవ్ శుక్రవారం సందర్శించనున్నారు. స్టేషన్‌ను గతంలో మోడల్ రైల్వేస్టేషన్‌గా ప్రకటించారు. ఆ స్థాయికి తగ్గట్లు అభివృద్ధి చేయడం లేదు. స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రయూణికులు కోరుతున్నారు. సంగెం-చింతలపల్లి మధ్య ఉన్న 67 గేట్ వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, స్టేషన్ సమీపంలోని 66వ గేట్‌కు దూరంగా క్యాబిన్ ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గేట్ పక్కనే క్యాబిన్‌ను నిర్మించాలని కోరుతున్నారు. చింతలపల్లి స్టేషన్లో గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్నూ జీఎం శుక్రవారం సందర్శించారు. చిల్డ్రన్స పార్క, కమ్యూనిటీహాల్‌ను ప్రారంభిస్తారు.