తెలంగాణ ఎంసెట్ మెడికల్ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2016 మెడికల్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మొత్తం 190 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు.
మొత్తం 1,01,005 మంది విద్యార్థులు మెడికల్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ సెట్ కోడ్ 'ఎస్' ప్రశ్నాపత్రాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఎంపిక చేశారు. తొలిసారిగా ఎంసెట్ పరీక్షకు బయో మోట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నిమిషం నిబంధనను అధికారులు పటిష్టంగా అమలుజేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్ష సెంటర్లలోనికి అనుమతించలేదు.