జరగబోయేది చెబుతుంది!
సైన్స్... ఫిక్షన్...
హారర్... టై...
సిక్త్స్‌సెన్స్...
ఏది చూసినా... అంతకుముందే జరిగినట్టు
అనిపించడం...
జరగబోయేదాన్ని
కలగనడం...
‘ఫైనల్ డెస్టినేషన్’ వంటి ఎన్నో సినిమాలు ఈ అంశం
ఆధారంగానే వచ్చాయి. ఆ ప్రభావంతో
నామాల రవీందర్సూరి తీసిన లఘుచిత్రమే సిక్త్స్‌సెన్స్...
డెరైక్టర్స్ వాయిస్:
మాది నల్గొండ జిల్లా జాల్పకుంట్ల. ఉస్మానియా యూనివ ర్శిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఫిల్ చేశాను. ఆలూరి సాంబశివరావు నిర్మించిన సిక్త్స్‌సెన్స్ అనే ఈ లఘుచిత్రాన్ని ఆలూని క్రియేషన్స్ బ్యానర్‌పై తీశాను. చిన్నచిన్న కవితలతో మొదలైన నా రచన... కథలు, నవలలు టీవీ ప్రోగ్రామ్స్ నుండి సినిమాలకు కథ అందించేంతవరకూ సాగింది. నాలుగు సినిమాలకి కథ, మాటలు అందించాను. అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఏడ్చేవాడిని... కంటికి చుక్క కారకుండా కసితీరా ఏడ్చేవాడిని.
ఓడిపోతానేమోనని ఏడ్చేవాడిని. కానీ ఓడిపోయాననుకున్న ప్రతిసారీ మా సూరన్న ఎప్పటికైనా నేను గెలుస్తానని ధైర్యం చెప్పేవాడు. పోతే, నేను రచయితగా పరిచయమవుతాననుకుంటే, డెరైక్టర్ని అవుతున్నాను. నా చిన్ననాటి మిత్రుడు బిజినెస్ పార్ట్నర్ అయిన నిర్మాత సాంబశివరావుగారికి కాన్సెప్ట్ చెప్పడం అత నికి నచ్చడం చకచకా జరిగిపోయాయి. ఇదే నిర్మాతతో ఇప్పుడు బిగ్ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాను. ఈ షార్ట్ ఫిలిమ్‌కి నాకు నా మిత్రులు బాగా సహకరించారు.
షార్ట్ స్టోరీ: జరగబోయేది ముందుగానే తెలియడం, కల రూపంలో సాక్షాత్కరించడం...
కామెంట్: ఫిక్షన్ కథను బాగా తయారుచేసుకున్నాడు. కెమెరా యాంగిల్స్ బావున్నాయి. భయానక రసాన్ని బాగా చూపించాడు. సస్పెన్స్‌ను ఎంతో ఉత్కంఠభరితంగా చూపాడు. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్... అన్నీ బావున్నాయి. ముఖ్యంగా డైలాగులు చాలా బావున్నాయి. కలలు నిజాలు... కలలు అబద్ధాలు... ఆకారంలో కలలు ఎలాగైనా ఉండొచ్చు... వంటి మాటలు బాగా రాశాడు. ‘ఏడుపును బయటకు రానీయకుండా... నవ్వును బయటకు తీసుకుని రారా...’ ‘నవ్వు నలిగిపోకుండా... ఏడుపు ఎగరగొట్టకుండా... రెండింటినీ మిక్స్ చేయరా...’ వంటి సంభాషణలు ఆర్సిఎం రాజు గళంలో పలకడం ఈ లఘుచిత్రానికి ప్లస్ అయ్యింది.
రూమ్ డెకొరేషన్ చాలా బావుంది. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చూపించడంలో దర్శకుడికి ఉన్న అభిరుచి కనపడుతోంది. ప్రధానపాత్రలో వేసిన వ్యక్తి డైలాగ్ డెలివరీ బాగాలేదు. భావాలను ముఖంలో బాగానే వ్యక్తీకరించాడు కాని, డైలాగ్ డెలివరీ మాత్రం చాలా పూర్‌గా ఉంది. ఇటువంటి సస్పెన్స్ చిత్రాలలో డైలాగ్‌లో ఎక్స్ప్రెషన్, ముఖంలో భయం... వంటివి పూర్తిశాతం ప్రదర్శించలేకపోతే చిత్రం రక్తికట్టదు. నటనలో టైమింగ్, ఇంకా ఎడిటింగ్ బావుండాలి. చిత్రంలో అన్ని హంగులూ పూర్తిస్థాయిలో ఉంటేనే ఆ చిత్రం కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. సినిమాలలో దర్శకులుగా స్థిరపడాలనుకునేవారు పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- డా.వైజయంతి
కలలు నిజాలు... కలలు అబద్ధాలు... ఆకారంలో కలలు ఎలాగైనా ఉండొచ్చు... వంటి మాటలు బాగా రాశాడు. ‘ఏడుపును బయటకు రానీయకుండా... నవ్వును బయటకు తీసుకుని రారా...’ ‘నవ్వు నలిగిపోకుండా... ఏడుపు ఎగరగొట్టకుండా... రెండింటినీ మిక్స్ చేయరా...’ వంటి సంభాషణలు ఆర్సిఎం రాజు గళంలో పలకడం ఈ లఘుచిత్రానికి ప్లస్ అయ్యింది.