మహిళపై గ్యాంగ్‌రేప్... నిందితులకు మరణశిక్ష
కాబూల్: మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ ఆఫ్ఘానిస్థాన్ కోర్టు ఆదివారం తీర్పు వెలువరించింది. దేశంలో ఇటువంటి నేరాలను ఆరికట్టేందుకు చర్యలు తీసుకోకుంటే మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడ్డింది. కోర్టు తీర్పుపై నిందితులు కోర్టుకు అపీలు చేసుకోవచ్చని సూచించింది. పగ్మన్ జిల్లాలో గత నెల వివాహానికి వాహానాల్లో వస్తున్న పలు కుటుంబాలకు చెందిన వారిపై... పోలీసులు దుస్తులు ధరించి కొందరు వ్యక్తులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనాల్లో ఉన్న వారిపై దాడి చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు అపహరించారు.
అంతేకాకుండా ఓ మహిళను సమీపంలోని పోలాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు నగదు, నగలతో అక్కడి నుంచి పరారైయ్యారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్బంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసి... కోర్టులో ప్రవేశపెట్టారు.
దాంతో నిందితులను విచారించి... కోర్టు మరణ శిక్ష విధించింది. కాబూల్‌లో పోలీసులు మారువేషంలో ఇలా దాడి చేసి సామూహిక అత్యాచారం జరిపి నిందితులకు శిక్ష పడటం తన సర్వీసులో ఇంతకుముందు చూడలేదని కాబూల్ నగర పోలీసు ఉన్నతాధికారి జహీర్ తెలిపారు.