సప్తాశ్వ రథంలో రాజన్న తనయుడు
నరసాపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన సప్తాశ్వ రథం(ఏడు గుర్రాల బండి)పై బస్టాండ్ సెంటర్ నుంచి ఊరేగిస్తూ రాజన్న తనయుడికి స్వాగతం పలికారు. గుర్రపు బండిలో ఎక్కిన యువనేత ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
దారిపొడవునా జననేతపై అభిమానులు పూల వర్షం కురిపించారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. యువనేత రాకతో పులకించిపోయిన నరసాపురం వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం కిక్కిరిసింది. కాగా, ప్రసాదరాజు వైఎస్సార్ సీపీ వదిలివెళతారని జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఆయన యువనేత చెంతనే ఉన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రసాదరాజు... రథంలో జగన్కు ఇరువైపుల నిల్చున్నారు. మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.