షో అదర హో ....
గ్రేటర్ నోయిడా: రెండేళ్లకొకసారి జరిగే భారత ఆటో ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రెండు రోజులు మీడియాకు, బిజినెస్ విజిటర్స్‌ను మాత్రమే అనుమతిస్తారు. 9వ తేదీ వరకూ జరిగే ఈ ప్రదర్శనకు శుక్రవారం నుంచి ప్రజలందరినీ అనుమతిస్తారు. దాదాపు 80 కొత్త వాహనాలను ఈ ఆటో షోలో ఆవిష్కరిస్తారని, ఏడు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.
తొలి రోజు 51 కొత్త మోడళ్లను వివిధ కంపెనీలు ఆవిష్కరించాయి. కత్రినా కైఫ్, రణబీర్‌కపూర్ వంటిసిని తారలు, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్ల వంటి దిగ్గజ క్రికెటర్లు ఈ ఆటో షోకు గ్లామర్‌ను అద్దారు. అందరికీ రవాణా (మొబిలిటి ఫర్ ఆల్) థీమ్‌తో సాగే ఈ ఆటో షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యఫాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ), సీఐఐలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
టయోటా కంపెనీ మిరాయ్ హైడ్రోజన్ కారును, ఇన్నోవా క్రిస్టా కార్లను, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పసంట్ జీటీని, హ్యుందాయ్ కంపనీ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ మోడల్ సొనాటా ఎఫ్సీఈవీని డిస్ప్లే చేశాయి.
మారుతీ సుజుకీ... కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజ్జాను ఈ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మహీంద్రా టీయూవీ300, రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటాలకు గట్టిపోటీనివ్వగలదన్న భావిస్తున్న ఈ కారు ధర రూ.6.79 లక్షల నుంచి రూ.13.77 లక్షల రేంజ్లో ఉంది.
హ్యుందాయ్... కంపెనీ టక్సన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ప్రతి ఏటా రెండు కొత్త మోడళ్లను తెస్తామని ప్రకటించింది. హెచ్ఎన్డీ-14 పేరుతో కాన్సెప్ట్ ఎస్‌యూవీని డిస్ప్లే చేసింది.
జనరల్ మోటార్స్... అంతా కొత్తదైన నాచ్‌బ్యాక్ షెవర్లే ఎసెన్షియాలను వచ్చే ఏడాది, ఆ తర్వాత షెవర్లే స్పిన్‌ను మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. షెవర్లే బీట్ యాక్టివ్ పేరుతో కాన్సెప్ట్ కారును డిస్ప్లే చేసింది. ఐదేళ్లలో భారత్‌లో తయారైన విడిభాగాలతోనే 85 శాతం కార్లను తయారు చేయడం లక్ష్యమని కంపెనీ పేర్కొంది.
యమహా మోటార్స్... సిగ్నస్ రే-జడ్ఆర్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.
ఇసుజు... అడ్వెంచర్ యుటిలిటి వెహికల్ డి-మ్యాక్స్ వి-క్రాస్‌ను ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంట్‌లో ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తిని ప్రాంరభిస్తామని తెలిపింది. ధర సుమారుగా రూ.15 లక్షల రేంజ్లో ఉంటుందని పేర్కొంది.
సుజుకి మోటార్ సైకిల్ ఇండియా... యాక్సెస్ 125లో కొత్త వేరియంట్‌ను, జిక్సర్ మోడల్లో కూడా కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది.
అశోక్ లేలాండ్ కంపెనీ ఆఫ్రికాలో 2 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది.
హీరో మోటొకార్ప్... కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన స్ప్లెండర్ ఐస్మార్ట్110ను ఆవిష్కరించింది. మరో మూడు కొత్త మోడళ్లు-స్పోర్ట్స్ బైక్ ఎక్స్ట్రీమ్ 200 ఎస్, డిజైన్ కాన్సెప్ట్ బైక్ ఎక్స్ఎఫ్3ఆర్, ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్ డ్యుయట్-ఈలను కూడా డిస్ప్లే చేసింది. ఈ ఆవిష్కరణలో ప్రముఖ హిందీ సినిమా నటుడు రణబీర్ కపూర్ కూడా పాల్గొన్నారు.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్.. నవి పేరుతో కొత్త 110 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది.
పియాజియో... వెస్పా స్కూటర్లను తయారు చేసే ఈ కంపెనీ స్పోర్ట్స్ స్కూటర్-బైక్ ఏప్రిలియా ఎస్ఆర్ 150ను ఆవిష్కరించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మార్కెట్లోకి తెస్తామని వివరించారు.
జాగ్వార్ ల్యాండ్‌రోవర్... కంపెనీ జాగ్వార్ ఎక్స్ఈ స్పోర్ట్స్ సలూన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.39.9 లక్షల నుంచి రూ.46.5 లక్షల రేంజ్లో ఉంటుంది.
ఫోక్స్‌వ్యాగన్... కాలుష్య ఉద్గారాల విషయంలో పెద్ద తప్పులు చేశామని, తమను క్షమించాలని ఫోక్స్‌వ్యాగన్ భారత ప్రజలను కోరింది. భారత కాలుష్య నిబంధనలకనుగుణంగానే తమ కార్లు ఉన్నాయని, నమ్మకాన్ని మరలా సాధిస్తామని పేర్కొంది.
ఫియట్ ఇండియా... ఈ ఏడాది మధ్యలో జీప్ బ్రాండ్‌లో రెండు వేరియంట్లను తెస్తామని తెలిపింది.
మెర్సిడెస్ బెంజ్... కొత్త ఎస్యూవీ జీఎల్సీ, ఎస్-క్లాస్ కాబ్రియోలెట్ కార్లను ఆవిష్క రించింది.
హోండా కార్స్ ఇండియా... ఏడు సీట్ల బీఆర్-వీ మోడల్ కారును ఆవిష్కరించింది.
అశోక్ లేలాండ్ ...నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. గురు ఐసీవీని, సన్‌షైన్ బస్ మోడళ్లను ఈ ఏడాదే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. హైబస్ పేరుతో హైబ్రిడ్ బస్‌ను, యూరో 6 ట్రాక్టర్ ట్రక్‌ను కూడా డిస్ప్లే చేసింది.