బాంబు పేలుడు: ఏడుగురికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్‌లోని ప్రధాన మార్కెట్లో బుధవారం సాయంత్రం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మార్కెట్ సమీపంలో శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో బ్యాగ్ ఉంచడంతో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఈ బాంబు పేలుడుకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు.