కానిస్టేబుల్ పరీక్షకు 79% హాజరు
హైదరాబాద్: రవాణా శాఖలో ఖాళీగా ఉన్న 137 ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్, 340 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 79 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 551 కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు 1,98,336 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.