జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు
అనంతపురం టౌన్: విధులు సక్రమంగా నిర్వర్తించనందుకు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ షఫీయుల్లాఖాన్పై శుక్రవారం సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ నాగవేణి ఉత్తర్వులు జారీ చేశారు. రామసుబ్బారెడ్డి అనే రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్కు చెందిన సర్వీస్ రికార్డులు మున్సిపల్ కార్యాలయంలో కనిపించకుండా పోయినందుకు బాధ్యుడుని చేస్తూ షఫీయుల్లాఖాన్పై చర్యలు తీసుకున్నారు.