Shakambari
-
దుర్గగుడిలో శాకంభరి ఉత్సవాల రెండవ రోజు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు (ఫొటోలు)
-
శాకాంబరిగా శ్రీభ్రమరాంబాదేవి
-
శాకంబరి అలంకారం
కడప నగరం ఎర్రముక్కపల్లెలోని శ్రీ చౌడేశ్వరీదేవి, గంగామాతలకు మంగళవారం శాకంబరి అలంకారం నిర్వహించారు. ఈనెల 28 నుంచి అమ్మవార్ల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాల అనంతరం దాదాపు 25 రకాల కూరగాయలు, ఆకుకూరలతో కనుల పండువగా అలంకారం చేశారు. ఈ అలంకారాలను చూసేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.-కడప కల్చరల్ -
శాకాంబరీ నమో నమః
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలోని అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని మంగళవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేకపూజలను చేశారు. ఆషాఢమాస పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబాదేవి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో అలంకరించారు. సంప్రదాయానుసారం అమ్మవారికి ప్రత్యేక అర్చనలను అర్చకులు, వేదపండితులు ఏకాంతంలో నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రధాన ద్వారానికి కుడివైపు ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేయించి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అలంకరించారు. అనంతరం 10 గంటలకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు, తదితర ప్రత్యేకపూజలను జేఈఓ హరినాథ్‌రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా చేశారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవీ, సప్తమాత్రుకలు, గ్రామదేవత అంకాళమ్మ, అమ్మవారి ఆలయప్రాంగణంలోని అష్టాదశ మహాశక్తి విగ్రహాలు, ధ్వజస్తంభాలు, అన్నదాన మందిరంలోని అన్నపూర్ణాదేవి వార్లను పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని శాకలతో అర్చించడంతో అతివష్టి అనావష్టి తొలగి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి కరువు కాటకాలు నివారింపబడుతాయని పురాణాలు చెబుతున్నట్లు జేఈఓ వెల్లడించారు.. -
వైభవంగా శాకంబరి అలంకారం
కర్నూలు (శ్రీశైలం) : శ్రీశైల మహాక్షేత్రంలో అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీ భ్రమరాంబదేవిని శుక్రవారం వేదమంత్రోచ్ఛరణల మధ్య శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. 40 రకాలకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, ఫలాదులతో ప్రధానాలయ రాజగోపురాలు మొదలుకొని ధ్వజస్తంభం,అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలతో అలంకరించారు. మూలవిరాట్‌తో పాటు అమ్మవారి ఉత్సవమూర్తిని కూరగాయలతో అలంకరించారు. ఈ పూజలలో ఈఓ సాగర్‌బాబు దంపతులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. శాకంబరి అమ్మవారిని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
శాకంబరి ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు