సూర్యాపేట విద్యార్థికి రూ.79.18 లక్షల వేతనం
ఒరాకిల్ కంపెనీకి ఎంపిక
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెంది న విద్యార్థి షేక్ నజీర్బాబా రూ.79.18 లక్షల వార్షిక వేతనానికి అమెరికాలోని ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంపికయ్యాడు. నజీర్బాబా ఐఐటీ కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల ఒకటవ తేదీన ఒరాకిల్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నజీర్బాబాను అప్లికేషన్ ఇంజీనీర్గా ఎంపిక చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రెడ్వుడ్సిటీలో ఉద్యోగం చేయనున్నాడు. నజీర్బాబా సూర్యాపేటలోని నవోదయ హైస్కూల్లో 2008-09 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.
2011లో ఐఐటీ ప్రవేశపరీక్షలో 239 ర్యాంకు సాధించి ఐఐటీ కాన్పూర్లో సీటు సంపాదించాడు. జమాలుద్దీన్-రహిమున్నీసాలకు ముగ్గురు సంతానం కాగా నజీర్బాబా రెండోవాడు, ఇద్దరు కుమార్తెలు. తండ్రి గ్రానైట్ కంపెనీలో కూలీ, తల్లి టైలర్.