shakehand
-
‘షేక్‌హ్యాండ్ ఇవ్వండి.. ఆశీర్వాదం పొందండి’
ముంబై: సాధారణంగా ఆలయానికి వెళ్లినప్పడు పూజారి ఆశీర్వదిస్తాడు. అక్కడ ఎవరైనా సాధువులు, సన్యాసులు ఉంటే వారికి నమస్కరించి.. ఆశీర్వాదం తీసుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా కుక్క ఆశీర్వాదం తీసుకున్నారా.. లేదా. పోని దానికి భక్తితో నమస్కరించారా.. ఆ పని కూడా చేయలేదా. అయితే ఈ వీడియో చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే.. అక్కడ కుక్క కనిపిస్తే.. ఈ వీడియో తప్పకుండా మీ మదిలో మెదులుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా సిద్ధతేక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం చాలా ఫేమస్. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. (చదవండి: ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం) ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గుడి బయట.. మెట్ల పక్కన కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఓ కుక్క కూర్చుని ఉంది. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులను పిలిచి మరి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాక ఆశీర్వదించింది. ఈ వింత సంఘటనను కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయ్యడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజనులు ‘ఈ వీడియో చూసి మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.. మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఇదేం ‘చాదస్తం’
నగర వాసుల్లో అనవసర భయాలు పదేపదే ఒకే పని... డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు మోహన్‌కు ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇస్తే రోజంతా అదే పనిగా చేతులు కడుగుతూనే ఉంటాడు. కళ్యాణి ఇంటిలో ఎవరైనా అడుగు పెడితే పదే పదే ఇల్లంతా నీళ్లు చల్లి శుభ్రం చేస్తూనే ఉంటుంది. ఇదే విషయమ్మీద భార్యాభర్తల మధ్య అనేకసార్లు గొడవలు చోటుచేసుకున్నాయి. అయినా ఆమెలో మార్పు లేదు. పైగా సాధారణ దగ్గు వచ్చినా తనకు క్యాన్సర్ వచ్చిందేమోననే భయంతో విలవిల్లాడిపోతుంది. అదేమని అడిగితే...ఫలానా సినిమాలో హీరోయిన్ ఇలాగే చనిపోయిందంటూ ఆ పాత్రను తనకు అన్వయించుకుంటుంది... ఇలాంటి మోహన్‌లు, కళ్యాణిలు మన మధ్య చాలా మంది ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ‘చాదస్తుల’ సంఖ్య పెరుగుతుండడం విస్తుగొల్పుతోంది. బంజారాహిల్స్: ఒకే పని రోజంతా చేస్తుండడం... ఒకేమాట పదే పదే చెప్పడం.. ముట్టుకుంటారనే భయం.. పట్టుకుంటారని బెంగ.. తనపై ఏదో పడుతుందని ఆందోళన.... అన్ని సమస్యలూ తన పైనే వేసుకుని... అన్నింటినీ తానే భరిస్తున్నట్లు భావించడం.. ఇలాంటి చేష్టలు ఇటీవల నగర వాసుల్లో పెరిగిపోయాయి.. చొక్కాను పట్టుకొని అదే పనిగా లాగుతుండటం.. సబ్బుతో పదే పదే ముఖం కడగడం వంటి చాదస్తాలను పాటించే వారు పెరుగుతున్నారు. ఇవే కాదు.. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు నగర వాసుల్లో అనుమానాలను పెంచడమే కాకుండా వారిని మరింత చాదస్తులుగా మారుస్తున్నాయి.. ఈ సమస్య చిన్నారులు మొదలుకొని అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోంది. ప్రముఖులకూ తప్పని భయాలు {పిన్సెస్ డయానా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ అందాల రాశి కూడా ఒక రకమైన చాదస్తంతో బాధపడేది. ‘ఈటింగ్ డిజార్డర్’తో బాధ పడే ఆమె తాను చాలా ఫిట్‌గా ఉన్నాననే కారణంగా ఆహారం ఎక్కువ తీసుకుని వాంతులు చేసుకునేది.రోగులకు ఎంతో విశిష్ట సేవలందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సైతం ఒక రకమైన చాదస్తంతో ఉండేది. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (సీఓడీ) కారణంగా ఆమె చివరి దశలో మంచం మీదనే ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది. వీరే కాదు.. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఇలాంటి చాదస్తాలతో సతమతమవుతున్నారు. జీవన శైలిలోని విపరీత పరిణామాలకు తోడు.. పని విధానంలోని అసాధారణమైన మార్పులు... ఒత్తిడి ఇలాంటి చాదస్తాలు... అనుమానాలకు తావిస్తోంది. అతి..అనర్థం నగరానికి చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్‌లో నడిచి వెళుతూ ఒక భవన నిర్మాణం వద్ద తల పెకైత్తి చూశాడు. అదే సమయంలో అతని కంట్లో సిమెంటు నీటి చుక్క పడింది. దీంతో అతను తన కంట్లో ఎవరో ఎయిడ్స్ ఉన్న వ్యక్తి ఉమ్మి వేశాడంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆస్పత్రులకు వెళ్లి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకున్నాడు. ఎలాంటి సమస్య లేదని ఎంతమంది వైద్యులు చెప్పినా నమ్మకుండా ఇప్పటికీ అలాగే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంటెక్ చదివిన మరో యువకుడు తనకు ఎలర్జీ ఉందనే అభిప్రాయంతో తన చేతులను సబ్బుతో నిరంతరం అదే పనిగా కడుగుతుండేవాడు. దీంతో అధిక రాపిడికి గురైన అతని చేతులు రంగు మారిపోయాయి. మచ్చుకు కొన్ని... మహిళల్లో చాలా మంది ఇంటిని పదే పదే ఊడ్చటం, తుడవడం.. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్తే మళ్లీ శుభ్రం చేయడం లాంటి సంఘటనలు కోకొల్లలు. మరికొందరు గ్యాస్ స్టౌను ఆపేశామా? లేదా 20 నుంచి 30 సార్లు తనిఖీ చేసుకోవడం చాదస్తాల్లో భాగమే. మరికొందరు రుచి చూసే పేరుతో పొయ్యి మీది వంటకాన్ని సగం ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి కేసులు అనేకం తన వద్దకు కూడా వస్తున్నాయని చెబుతున్నారు నగరానికి చెందిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పూర్ణిమా నాగరాజు. ‘ఫర్ఫెక్ట్’ కావాలనుకొని... చాలామంది ఉద్యోగులు తమకు తాము పర్ఫెక్ట్గా ఉన్నామనే భావనలో ఉంటారు. మరికొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో అన్ని పనులు తామే చేస్తుండటం... జట్టులో ఉన్న ఇతర సభ్యుల బాధ్యతల్లోకి తొంగిచూడటం.. పనంతా తానే చేస్తున్నట్లుగా భావించడం చేస్తుంటారు. దీనికి తోడు తమ ఉద్యోగంపై భయం. పక్కవారు చూస్తున్నారేమోననే ఆందోళన. ఇలాంటివన్నీ చాదస్తులుగా మారుస్తున్నాయి. కొందరు యువకులు విపరీత స్థాయిలో ప్రేమను ప్రదర్శిస్తుంటారు. తాను ప్రేమించిన అమ్మాయి మీద సర్వ హక్కులు తనవేనని అతిగా పెత్తనాన్ని చెలాయిస్తుంటారు...ఇదీ చాదస్తంలో భాగమే. కొంతమంది సన్నగా, అస్థిపంజరంలా ఉన్నప్పటికీ తాము చాలా లావుగా ఉన్నామన్న భావనతో ఇంకా డైటింగ్ చేస్తుంటారు. ఈటింగ్ డిజార్డర్‌లో భాగమైన ‘బులీమియా’ అనే చాదస్తంతో వీరు బాధ పడుతున్నట్టు లెక్క. మరికొందరు తాము ఫిట్‌గా ఉన్నామనే భావనతో ఏది తిన్నా ఏం కాదని అతిగా తిని వాంతులు చేసుకుంటారు.. ఇలాంటి వారిని సాధారణంగా ‘అనోరెక్సియా’ బాధితులుగా పరిగణిస్తారని డాక్టర్ పూర్ణిమ పేర్కొన్నారు. -
కరచాలనమే బ్రేకింగ్ న్యూస్!
* ఇద్దరు సీఎంల కలయికపై వెంకయ్యనాయుడు స్పందన * అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో బాబు, కేసీఆర్ ఆలోచించుకోవాలి * అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్త కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడం పెద్ద వార్త కాకూడదు. అయితే అది పెద్ద వార్త అయింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై వారే ఆలోచించాలి. విభేదాలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించా. పాటిస్తారో లేదో వారి ఇష్టం’ అని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు దేశాల అధ్యక్ష, ప్రధానులతో భేటీ అవడం సాధారణ అంశాలుగానే పరిగణిస్తామన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉద్దేశించిన అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫీజు రీయిం బర్స్మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 1956 స్థానికత నిబంధనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్డర్ నుంచి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా, రియల్ ఎస్టేట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా బిల్లు ఉంటుందన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తోపాటు కెడ్రాయి లాంటి సంస్థలతోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వచ్చే అవకాశం ఉందన్నారు. నిధుల సేకరణపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలి పురపాలక సంస్థలు నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా వనరులు సమకూర్చుకోవటంపై దృష్టి సారించాలని వెంకయ్య సూచించారు. పనులు వసూలు చేసి పారదర్శకంగా ఖర్చు పెట్టాలన్నారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు సుదీర్ఘ కాలం తరువాత కూడా ప్రభుత్వాలు అధికారాలు అప్పగించకపోవటంపై సమీక్షించటం తన ప్రాధాన్యత అంశాలల్లో ఒక్కటని తెలిపారు. కాలపరిమితి తీరినందున జేఎన్ఎన్యూఆర్ఎం పథకం స్థానంలో కొత్త మిషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ్హ కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బీమా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలును కోరుతున్నాం. అర్థవంతమైన సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిల్లుపై చర్చించేందుకు తయారుగా ఉన్నాం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు నెగ్గేందుకు సహకరించాలి. 2008లో యూపీఏ ప్రభుత్వమే ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. తాజా బిల్లులో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాం. సవరణ బిల్లులో ఉన్న తేడా అదే.