‘షేక్‌హ్యాండ్‌ ఇవ్వండి.. ఆశీర్వాదం పొందండి’ | Dog Shakes Hands Blesses Devotees at Siddhivinayak Temple in Maharashtra | Sakshi
Sakshi News home page

‘షేక్‌హ్యాండ్‌ ఇవ్వండి.. ఆశీర్వాదం పొందండి’

Published Tue, Jan 12 2021 12:39 PM | Last Updated on Tue, Jan 12 2021 4:43 PM

Dog Shakes Hands Blesses Devotees at Siddhivinayak Temple in Maharashtra - Sakshi

ముంబై: సాధారణంగా ఆలయానికి వెళ్లినప్పడు పూజారి ఆశీర్వదిస్తాడు. అక్కడ ఎవరైనా సాధువులు, సన్యాసులు ఉంటే వారికి నమస్కరించి.. ఆశీర్వాదం తీసుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా కుక్క ఆశీర్వాదం తీసుకున్నారా.. లేదా. పోని దానికి భక్తితో నమస్కరించారా.. ఆ పని కూడా చేయలేదా. అయితే ఈ వీడియో చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే.. అక్కడ కుక్క కనిపిస్తే.. ఈ వీడియో తప్పకుండా మీ మదిలో మెదులుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా సిద్ధతేక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం చాలా ఫేమస్‌. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. (చదవండి: ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం)

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గుడి బయట.. మెట్ల పక్కన కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఓ కుక్క కూర్చుని ఉంది. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులను పిలిచి మరి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమే కాక ఆశీర్వదించింది. ఈ వింత సంఘటనను కొందరు వీడియో తీసి.. సోషల్‌ మీడియా‌లో షేర్‌ చేయ్యడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజనులు ‘ఈ వీడియో చూసి మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.. మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement