టూల్బాక్స్లో మహిళ మృతదేహం
న్యూఢిల్లీ: ఒక ప్రముఖ పాఠశాల స్కూలు బస్సు వెనుకభాగంలో ఉన్న టూల్బాక్స్లో మహిళ శవం లభించింది. ఆమె వయసు 35 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం కుళ్లి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని పోలీసులు చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన ఆమె పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఆ మహిళ మూడు రోజుల క్రితం మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే షాలోమ్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూలు బస్సు వర్క్షాపు నుంచి వచ్చిందని తెలిపారు. గత మూడు రోజులుగా ఈ బస్సు షెడ్డులోనే ఉందని చెప్పారు.
మహిళను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, మతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామని దర్యాప్తు అధికారి తెలిపారు.