Shami wife dress issue
-
మళ్లీ ఫొటో పెట్టిన షమీ!
న్యూఢిల్లీ: తన భార్య వస్త్రధారణపై వివాదం చెలరేగినప్పటికీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వెనక్కు తగ్గడం లేదు. తన భార్యతో కలిసివున్న ఫొటోను తాజాగా ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు భార్యపై తనకు అంతులేని ప్రేమ ఉందని పేర్కొన్నాడు. ‘నిన్ను చూసినప్పుడు నాకో అందమైన తోడు దొరికిందని గట్టిగా చెప్పగలను.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. డిసెంబర్ 23న తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను షమీ ఫేస్బుక్లో పోస్టు చేయగా.. దానిపై కొందరు విద్వేషం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకోగా.. కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. ఈ విషయంలో తన భార్య, కూతురికి షమీ అండగా నిలిచాడు. తన భార్య వేసుకున్న దుస్తులు ఇస్లాం మతానికి విరుద్ధమైనవి కావని పేర్కొన్నాడు. కాగా, 2017 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించాడు. తన స్నేహితులందరూ శాంతిసౌఖ్యలతో సంతృప్తికర జీవితం గడపాలని కోరుకున్నాడు. -
మళ్లీ ఫొటో పెట్టిన షమీ!
-
భార్య డ్రెస్ వివాదంపై స్పందించిన షమీ!
దుస్తుల విషయంలో తన భార్య, కూతురికి భారత క్రికెటర్ మహమ్మద్ షమీ అండగా నిలిచాడు. ఈ నెల 23న తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను షమీ ఫేస్బుక్లో పోస్టు చేయగా.. దానిపై కొందరు విద్వేషం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకోగా.. కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. అసలు నువ్వు ముస్లింవేనా, ఇలాంటి దుస్తులు ఎలా వేసుకుంటావు? నీకు సిగ్గు లేదా? నీ భార్య బురఖా ఎందుకు ధరించలేదు? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో క్రికెటర్ మహ్మద్ కైఫ్ షమీకి అండగా నిలిచాడు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ స్పందిస్తూ.. 'ఈ ఇద్దరే నా జీవితం. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. (ఇతరులను వేలెత్తి చూపేముందు) మనలో మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో మొదట చూసుకోవాలి' అని షమీ పేర్కొన్నాడు. 'జీవితంలో అందరికీ కోరుకున్నది దొరకదు. అదృష్టవంతుల నుదుటన అది రాసిపెట్టి ఉంటుంది. లోలోపల కాలిపోయేవాళ్లు కాలిపోని' అంటూ విద్వేషకారులకు చురకలు అంటించారు. తన భార్య వేసుకున్న దుస్తులు ఇస్లాం మతానికి విరుద్ధమైనవి కావని పేర్కొన్నాడు.